నా కూతురిని హ‌గ్ చేసుకోవ‌డం న‌చ్చ‌లేదు

బిగ్‌బాస్ సీజ‌న్‌-5 ముగింపు ద‌శ‌కు చేరింది. దీంతో హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్ల కుటుంబ స‌భ్యులను క‌ల‌వ‌డానికి నిర్వాహ‌కులు అవ‌కాశం ఇచ్చారు. కుటుంబ స‌భ్యుల ప్ర‌వేశంతో హౌస్ తీవ్ర భావోద్వేగంతో నిండిపోయింది. మొద‌ట‌గా కాజ‌ల్ ఫ్యామిలీ…

బిగ్‌బాస్ సీజ‌న్‌-5 ముగింపు ద‌శ‌కు చేరింది. దీంతో హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్ల కుటుంబ స‌భ్యులను క‌ల‌వ‌డానికి నిర్వాహ‌కులు అవ‌కాశం ఇచ్చారు. కుటుంబ స‌భ్యుల ప్ర‌వేశంతో హౌస్ తీవ్ర భావోద్వేగంతో నిండిపోయింది. మొద‌ట‌గా కాజ‌ల్ ఫ్యామిలీ వ‌చ్చి వెళ్లింది.  82వ రోజు గురువారం హౌస్‌లోకి మ‌రిన్నికుటుంబాలు వ‌చ్చి సంద‌డి చేశాయి. ఈ సంద‌ర్భంగా సిరి త‌ల్లి శ్రీ‌దేవి హౌస్‌లోకి వెళ్లింది. సిరి స‌న్నిహితుడు ష‌ణ్ముక్‌తో శ్రీ‌దేవి షాకింగ్ కామెంట్స్ చేసింది.

సిరి, ష‌ణ్ముక్ మ‌ధ్య హౌస్‌లో సంథింగ్ సంథింగ్ అనే ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. వాళ్ల మ‌ధ్య ఎమోష‌న్స్ కూడా అట్లే వున్నాయి. ఇదే ఫీలింగ్‌ని సిరి త‌ల్లి శ్రీ‌దేవి హౌస్‌లో వ్య‌క్త‌ప‌ర‌చ‌డం గ‌మ‌నార్హం. అయితే ఆమె త‌న భావ‌న‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు బ‌హిరంగ‌ప‌ర‌చ‌డంతో ఓ త‌ల్లి ఆవేద‌న‌, భ‌యం క‌నిపించాయి. అస‌లేం జ‌రిగిందంటే…

“తండ్రి లేని పిల్ల కదా! షణ్ముఖ్‌ తండ్రిగా, అన్నగా అన్ని రకాలుగా సాయం చేస్తూ దగ్గరవుతుండటం నచ్చలేదు. దగ్గరవడం మంచిదే కానీ హగ్గులు నచ్చట్లేదు ” అని సూటిగా ష‌ణ్ముక్‌కే శ్రీ‌దేవి చెప్పింది. దీంతో సిరి ఒక్క‌సారిగా షాక్ గురైంది. టాపిక్‌ను  డైవర్ట్‌ చేస్తూ త‌ల్లిని పక్కకు తీసుకెళ్లింది. 

హగ్‌ చేసుకోవడం నచ్చలేదని ఎందుకలా అన్నావు? అలా అనకూడదు కదా! ఫీలవుతారు అని త‌ల్లిపై సిరి ఆగ్రహించింది. తల్లిగా త‌న‌కు చెప్పాల్సిన ఉందంటూ కూతురికి అదే రీతిలో జవాబిచ్చింది శ్రీదేవి. అందరి ముందు కాకుండా త‌న‌కు పర్సనల్‌గా చెప్పాల్సిందని సిరి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

త‌ల్లి వెళ్లిపోయాక సిరి వచ్చి హగ్‌ చేసుకుని ఏడవగా షణ్ను ఆమెను మనసారా హత్తుకుని ఓదార్చలేకపోయాడు. సిరి తల్లితో ఇలా మాట పడాల్సి వచ్చిందని తెగ‌ ఫీలయ్యాడు. హగ్గులు నచ్చలేదని  తల్లి చెప్పినప్పుడు సిరి ఒక్క మాట కూడా అడ్డు చెప్ప‌లేద‌నే బాధ‌తో ష‌ణ్ను ఒంటరిగా కూర్చుని ఏడ్చాడు. 

ఈ హౌస్‌లో ఉండేందుకు తనకు అర్హత లేదంటూ త‌న‌కు తానుగా తిట్టుకున్నాడు. మొత్తానికి సిరి త‌ల్లి రాక‌, ష‌ణ్నుకు ఒకింత షాక్ ట్రీట్‌మెంట్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.