‘సీతారామం’….కమనీయం

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్..మృణాల్ ఠాకూర్..రష్మిక నటించిన ప్రేమ కథా చిత్రం సీతారామం. ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది.  Advertisement ఇప్పటి వరకు ఈ సినిమా ఓ ఫీల్ గుడ్ ప్రేమ కథ…

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్..మృణాల్ ఠాకూర్..రష్మిక నటించిన ప్రేమ కథా చిత్రం సీతారామం. ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. 

ఇప్పటి వరకు ఈ సినిమా ఓ ఫీల్ గుడ్ ప్రేమ కథ అనే అభిప్రాయమే సర్వత్రా వుంది. ఇప్పుడు అంతకు మించి అన్న పాయింట్ యాడ్ అయింది. సినిమాలో సీతారాముల ప్రేమ కథను తవ్వుతూ వెనక్కు వెళ్తే సూత్ర ధారులుగా రష్మిక..తరుణ్ భాస్కర్ కనిపించారు. ఈ ట్రాక్ కొంచెం మహానటిలో ‘సమంత..విజయ్’ ల ట్రాక్ మాదిరిగా కనిపిస్తుంది.

ఆ విషయం పక్కన పెడితే ట్రయిలర్ ఆసక్తిని పెంచేలా కట్ చేసారు. సినిమా నిండా చాలా స్టార్ కాస్టింగ్ కనిపిస్తోంది. అందరి పాత్రలు కూడా కీలకమైనవే అన్న ఫీల్ ను ట్రయిలర్ కలిగించింది. కాస్త సస్సెన్స్ ను కూడా జనరేట్ చేసేలా ట్రయిలర్ ను కట్ చేసారు. 

ఎక్కడా రిపీట్ లేదు..అనాసక్తి లేదు..ట్రయిలర్ రన్ రేసీగానే వుంది. మరీ ఫీల్ గుడ్ అనే భావన ట్రయిలర్ లో ఎక్కువగా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో ఆసక్తిమైన సస్పెన్స్ తో కూడిన పాయింట్ వుందనే ప్రొజెక్షన్ ఇచ్చారు.

ఇప్పటి వరకు సీతారామంలో పాటలే భావుకతతో వుంటాయి అనుకుంటే ట్రయిలర్ లో వినిపించిన మాటలు కూడా అదే టచ్ తో వున్నాయి. ‘కాశ్మీర్ ను మంచుకు వదిలేసావా’ అన్న పద ప్రయోగం బాగుంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం బాగుంది. విజువల్స్ కూడా చాలా రిచ్ గా వున్నాయి.