ఈ మధ్య రెండు సినిమాల పేర్లు గట్టిగా వినిపించాయి. నిజానికి మూడు సినిమాలు హిట్ అయ్యాయి. బింబిసార..సీతారామం..కార్తికేయ 2. అయితే బింబిసార విజయం ఆ తరువాత వచ్చిన సీతారామం విజయం ముందు చిన్న బోయింది.
సినిమా హిట్ నే. డబ్బులు వచ్చాయి. కానీ పేరు విషయంలో మాత్రం వెనుకబడిపోయింది. సీతారామం హోరులో అది వినిపించలేదు. అంతలోనే కార్తికేయ 2 వచ్చింది. దాని హడావుడి ఎక్కువయింది. దాంతో బింబిసార పేరు దాదాపు మరిచిపోయారు.
అందువల్ల సీతారామం..కార్తికేయ 2 సంగతులు చూసుకుంటే ఓ విషయం మాత్రం క్లారిటీగా కనిపిస్తుంది. సీతారామం సినిమా ను జనాలు వారంతట వారే మౌత్ పబ్లిసిటీతో ముందుకు తీసుకుపోయారు. సీతారామం ఫీవర్ తో ఫేస్ బుక్ ఊగిపోయింది. సీతారామం సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఫేస్ బుక్ లో కవిత్వాలు వొలకబోసేసారు. వారి భావాలు, భావనలు పొయిటిక్ గానే పంచుకున్నారు. దాంతో సీతారామం సినిమా ఇప్పటికీ ఇంకా కలెక్షన్లు సాధిస్తోంది. శని, ఆదివారాల్లో చాలా చొట్ల ఫుల్స్ సాధించడం అంటే మామూలు సంగతి కాదు. ఎందుకంటే ఇది మూడోవారం కదా?
కార్తికేయ 2 సంగతి వేరే. సీతారామం మాదిరిగా కాదు. దాని చూస్తున్నారు. బాగుంది అంటున్నారు. కలెక్షన్లు సాధిస్తోంది. కానీ సీతారామం మాదిరిగా ఫేస్ బుక్ ను కవిత్వాలతో నింపేయడం లేదు. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం జోరుగా వుంది. ఓవర్ సీస్ లో కార్తికేయ 2 ను ఆరంభంలో వన్ మిలియన్ కు కాస్త తక్కువగా చేస్తుందని అంచనా వేసారు. కానీ ఇప్పుడు చూస్తుంటే మిలియన్ దాటేసేలా వున్నాయి కలెక్షన్లు. కానీ బించిసార ఈ ఫీట్ సాధించలేకపోయింది.
కార్తికేయ 2 సినిమాను చూస్తున్నారు. బాగుందని వారిలో వారు అనుకుంటున్నారు. బాగున్న సినిమానే చూసాం అనుకుంటున్నారు. కానీ దాన్ని చూడండహో అంటూ సోషల్ మీడియాలో టముకు వేయడం లేదు. కానీ సీతారామం విషయంలో మాత్రం చూసిన ప్రతి ఒక్కరు మరొక్కరిని అయినా చూసేలా చేసారు. చేస్తున్నారు అదే తేడా. ఈ రెండు సినిమాలకు.