సితార సినిమాలు- వాయిదాలు

ఒక సినిమా వాయిదా అంటే అర్థం చేసుకోవచ్చు. రెండు సినిమాలు వాయిదా అంటే ఓకె అనొచ్చు. ప్లానింగ్ లో వున్న ప్రతి సినిమా డేట్ ప్రకటించడం, వాయిదా వేయడం, ప్రకటించడం, వాయిదా వేయడం. దీనికి…

ఒక సినిమా వాయిదా అంటే అర్థం చేసుకోవచ్చు. రెండు సినిమాలు వాయిదా అంటే ఓకె అనొచ్చు. ప్లానింగ్ లో వున్న ప్రతి సినిమా డేట్ ప్రకటించడం, వాయిదా వేయడం, ప్రకటించడం, వాయిదా వేయడం. దీనికి కారణమేమిటో? వర్క్ లో లోపమా? ప్లానింగ్ లో లోపమా? గతంలో ఆదికేశవ సినిమా రెండు మూడు డేట్ లు మారి విడుదలయింది.

గుంటూరు కారం సంగతి తెలిసిందే. విడమర్చి చెప్పనక్కరలేదు. టిల్లు స్క్వేర్ ఇప్పటికి చాలా సార్లు వాయిదా పడింది. అలాగే విష్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా మళ్లీ మరోసారి వాయిదా పడింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరికి వచ్చింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూడాలి.

ప్రస్తుతానికి టిల్లు కు మార్చి మూడో వారంలో డేట్ వుంది. అందువల్ల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సమ్మర్ కు మూవ్ అయ్యే అవకాశం వుంది. దుల్కర్ తో లక్కీ భాస్కర్, బాలయ్య-బాబితో మరో సినిమా. గౌతమ్ తిన్ననూరి మ్యాజిక్ సినిమా షూటింగ్ లో వున్నాయి. సో, మార్చి నుంచి చూసుకుంటే వరుసగా టిల్లు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మ్యాజిక్, మే వరకు సరిపోతాయి. జూన్ వేళకు లక్కీ భాస్కర్ ను రెడీ చేసుకుంటే ఇక వరుసగా సినిమాలే. బాలయ్య సినిమాను దసరాకు రిజర్వ్ చేసుకుంటారేమో?

ఇవి కాక రవితేజ-అనుదీప్ సినిమా ప్లానింగ్ లో వుంది. సంపత్-సాయిధరమ్ గాంజా శంకర్ సినిమా అటు ఇటు ఊగుతోంది.