కేజీఎఫ్ లో రాకీ భాయ్ ఎలివేషన్స్ చూశాం. సలార్ లో దేవా హీరోయిజం చూశాం. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా పక్కా హీరో ఎలివేషన్స్ తో వస్తోంది ఈగల్ సినిమా. ఈరోజు రిలీజైన ట్రయిలర్ చూస్తే, ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది.
ఈగల్ సినిమా ట్రయిలర్ మొత్తాన్ని పూర్తిగా హీరో ఎలివేషన్స్ కే కేటాయించారు. 'అక్కడ ఒకడుంటాడు..' అనే డైలాగ్ తో మొదలుపెట్టి, అక్కడ పదేళ్ల నుంచి ఓ గాడ్జిల్లా ఉంది, ఇదంతా వాడి అడవి, మృగాలను మింగే మహాకాళుడు నిద్రలేచాడు లాంటి డైలాగ్స్, సినిమాలో హీరోయిజం ఏ రేంజ్ లో ఉండబోతోందో చెప్పకనే చెప్పాయి.
ఇక “దళం, సైన్యం కాదు దేశమే వచ్చినా ఆపుతాను” అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ట్రయిలర్ లో హైలెట్ గా నిలిచింది. మాస్ డైలాగ్స్, స్టయిలిష్ యాక్షన్, ఫారెస్ట్ లొకేషన్స్, మంచి తారాగణం, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఫైనల్ గా రవితేజ గెటప్.. ఇలా ప్రతి కోణంలో ఈగల్ సినిమా ఆకట్టుకుంటుంది.
కార్తీక్ ఘట్టమనేని డైరక్ట్ చేసిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. దావ్ జాంద్ సంగీతం అందించాడు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది ఈగల్ సినిమా.