సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ఈ చిత్రాన్ని జూలై 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా హీరో సంజయ్ రావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలేంటంటే..
“ఈ కథ మా నాన్న ద్వారా నా దగ్గరకు వచ్చింది. డైరెక్టర్ నాకు స్టోరీ చెబుతూనే ఆయన తెగ నవ్వుకున్నారు. నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది. నేను డాగ్ లవర్ కావడంతో షూటింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేశా. మా డాడీ ఇన్పుట్స్ ఇవ్వరు. నేను వెళ్లి అడిగితే సలహా ఇస్తారు. లీడ్ రోల్లోనే విభిన్న పాత్రలు చేయాలని ఉంది. ఒక యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలని ఉంది. విలన్‌గా ఓ తమిళ చేస్తున్నా. శింబు హీరోగా నటిస్తున్నారు.
రెగ్యూలర్ సినిమాల్లో హీరోయిన్ అంటే గ్లామర్.. హీరోయిన్ పెట్టాలని పెడతారు. కానీ ఈ సినిమాలో ప్రణవి రోల్ ఫుల్ లెంగ్త్‌లో ఉంటుంది. చాలా ముఖ్యమైన పాత్ర ఆమెది. ఈ సినిమాలో చాలా మంది డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయని అనుకుంటున్నారు. అలాంటివేమి ఉండవు. జనరల్‌గా రాత్రి పూట బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుకునేదే ఉంటుంది. అదే రియాలిటీ ఉంటుంది. ఈ రియాలిటీకి యంగ్ జనరేషన్ కనెక్ట్ అవుతోంది.
ఈ సినిమాలో బేబీ (కుక్క)దే కీరోల్. అదే సినిమాను మొత్తం డిసైడ్ చేస్తుంది. నేను మా నాన్నను చూసి ఇండస్ట్రీకి వచ్చా. ఆ తరువాత నేను బన్నీని చూసే అడుగుపెట్టా. ఆయనలాగా కష్టపడి పైకి రావాలని ఉంది. బన్నీ జర్నీ నాకు తెలుసు. ఓ గిఫ్ట్ అన్నకు ఇవ్వమని వాళ్ల అసిస్టెంట్‌కు ఇచ్చి వచ్చా. మళ్లీ రేపు వెళ్లి కలుస్తా. నాకు పెద్దగా ఎవరితో పరిచయాలు లేవు. నేను ఎవరి అయినా కలవాలంటే వాళ్ల ఇంటి బయట నిల్చుంటా. ఇందాక బన్నీ ఇంటి బయట నిలబడ్డా.
భీమ్లా నాయక్ సినిమా సమయంలో త్రివిక్రమ్‌ను కలిసేందుకు ఐదు రోజులు అక్కడ జనాల మధ్య లైన్లో నిలబడ్డా. ఒక బౌన్సర్ నన్ను చూసి ఏంటి సార్ అక్కడ నిల్చున్నారని అన్నాడు. తరువాత రెండు నిమిషాలు త్రివిక్రమ్ గారితో మాట్లాడా. హీరోగా రెండు సినిమాలు ఉన్నాయి. అవి హోల్డ్‌లో పెట్టా. ఒక సినిమా షూట్ స్టార్ట్ అయింది. ఓ పిట్టకథ చిత్రం కో డైరెక్టర్‌గా పనిచేసిన సాయికృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. నాకు వెబ్‌సిరీస్ అని.. సినిమా అని వేరే క్యాటగిరీలు ఉండవు. కెమెరానే నా క్యాటగిరీ.