Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలయ్యను ఫుల్లుగా వాడేసిన చిన్న సినిమా

బాలయ్యను ఫుల్లుగా వాడేసిన చిన్న సినిమా

చిన్న సినిమాల్లో అక్కడక్కడ స్టార్ హీరోల్ని వాడుకోవడం సహజం. సదరు హీరోల ఫ్యాన్స్ ను తమవైపు ఆకర్షించేందుకు ఈ ఎత్తుగడ వేస్తుంటారు. సదరు హీరోలు కూడా ఇలాంటి పనుల్ని చూసీచూడనట్టు వదిలేస్తుంటారు. 

మహేష్, పవన్, ప్రభాస్ లాంటి హీరోల క్లిప్పింగులు, కటౌట్లు చిన్న సినిమాల్లో కనిపించడం చాలా కామన్. ఇప్పుడు అలాంటిదే మరో ప్రయత్నం జరిగింది. కాకపోతే ఇది వేరే లెవెల్.

షికారు అనే చిన్న సినిమా వస్తోంది. ఈ చిన్న సినిమాలో మరో చిన్న పాత్ర ఉంది. హీరో పక్కన ఫ్రెండ్ రోల్ అది. ఆ పాత్రతో బాలయ్యను ఫుల్లుగా వాడేశారు. అతడో బాలకృష్ణ వీరాభిమాని. బాలయ్య సినిమా డైలాగులు చకచకా చెబుతుంటాడు. ఇలా సినిమాలో బాలయ్య రిఫరెన్సుల్ని విచ్చలవిడిగా వాడేశారు.

ఇది చాలదన్నట్టు సినిమాలో పోసాని ఎపిసోడ్ కూడా ఉంది. అతడు కూడా సినిమాలో బాలయ్య అభిమానే. బాలకృష్ణను పొగుడుతూ వీళ్లిద్దరి మధ్య కూడా ఓ భారీ సీన్ పెట్టేశారు. ఇలా రెండు గంటల నిడివి ఉన్న షికారు సినిమాలో బాలయ్య రిఫరెన్సులు అడుగడుగునా కనిపిస్తాయి. నందమూరి ఫ్యాన్స్ అంతా ఈ సినిమాను కచ్చితంగా చూడాలంటూ మేకర్స్ ఊరిస్తున్నారు.

ఓ కుర్రాడికి, పెళ్లయిన ఓ అమ్మాయికి మధ్య నడిచే ఎఫైర్ ను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. తమిళ నటి సాయిథన్సిక ఇందులో మెయిన్ లీడ్ పోషించింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?