ప్రతి హీరోయిన్ కు తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కొన్ని కోరికలుంటాయి. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లకు కూడా అలాంటి కొన్ని కోరికలున్నాయి. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో స్పష్టంగా వెల్లడించింది శోభిత.
“వ్యక్తిత్వం పరంగా అణకువగా ఉండే వ్యక్తి నాకు కావాలి. చాలా ప్రాక్టికల్ గా ఉండే వ్యక్తి అయి ఉండాలి. జీవితం చాలా చిన్నదని, మనందరం ఈ భూమ్మీదకు ఇలా వచ్చి అలా వెళ్లేవాళ్లమనే అభిప్రాయంతో ఉండే వ్యక్తి కావాలి. అన్నీ తనకే తెలుసు, తనే సర్వస్వం అనే ఫీలింగ్ ఉండకూడదు. మంచిగా, నలుగురి పట్ల దయతో ఉన్న వ్యక్తి నాకు భర్తగా కావాలి.”
ఇలా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది శోభిత. తనపై గతంలో వచ్చిన రూమర్సపై మరోసారి స్పందించింది ఈ నటి. తన వ్యక్తిగత జీవితాన్ని కాకుండా, కెరీర్ ను చూడాలని కోరింది.
“మీరు నన్ను చూడాలనుకుంటే లేదా నన్ను తెలుసుకోవాలనుకుంటే.. నా కెరీర్ చూడండి, నా కష్టాన్ని చూడండి, నేను ఏం సాధించానో తెలుసుకోండి. అది నాకు చాలా విలువైనది. నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడతారు. నేను నా ఫీల్డ్ లో చాలా కష్టపడ్డాను. దాన్ని ఎందుకు గుర్తించడం లేదు.”
ఇలా తన ఆవేదన వ్యక్తం చేసింది శోభిత. హీరో నాగచైతన్యతో ఆమె క్లోజ్ గా ఉందంటూ కొన్నాళ్ల కిందట పుకార్లు వచ్చాయి. లండన్ లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటో వైరల్ అవ్వడం, ఈ ఊహాగానాలకు మరింత తావిచ్చింది. కొన్నాళ్లకు ఆ పుకార్లను ఖండించిన శోభిత, తాజాగా మరోసారి తనపై వస్తున్న రూమర్లపై పైవిధంగా స్పందించింది.