సాఫ్ట్ వేర్ కేరాఫ్ మార్కెట్ మహాలక్ష్లి

కొత్త.. సమ్ థింగ్ న్యూ. ఇదే ఇప్పటి ట్రెండ్. అది ఏ విషయంలో అయినా. సినిమా కు కూడా అదే వర్తిస్తుంది. అందుకే కొత్త కొత్త పాయింట్లు పట్టుకుని కథలు అల్లుతున్నారు సినిమా జనాలు.…

కొత్త.. సమ్ థింగ్ న్యూ. ఇదే ఇప్పటి ట్రెండ్. అది ఏ విషయంలో అయినా. సినిమా కు కూడా అదే వర్తిస్తుంది. అందుకే కొత్త కొత్త పాయింట్లు పట్టుకుని కథలు అల్లుతున్నారు సినిమా జనాలు. కూరగాయల మార్కెట్ లో రఫ్ అండ్ టఫ్ గా వుంటూ, మాటలతో మంటెక్కించేసే అమ్మాయిని, సాఫ్ట్ గా వుండే సాఫ్ట్ వేర్ కుర్రాడు ఇష్టపడితే ఎలా వుంటుంది? పైగా ఈ వైనం కుర్రాడి తల్లికి నచ్చకపోతే.. ఇంకా మజా కదా. ఆపైన కాయగూరల షాపులో కూర్చుని వర్క్ ఫ్రమ్ మార్కెట్ అనే విధంగా వర్క్ చేస్తే ఇంకెంత మజాగా వుంటుంది. ఇవన్నీ కలిసి తయారు చేసిన సినిమా మాదిరిగా కనిపిస్తోంది. మార్కెట్ మహాలక్ష్మి టీజర్ చూస్తుంటే.

మార్కెట్ మహాలక్ష్మి టీజర్ ను శ్రీవిష్ణు విడుదల చేసారు. కేరింత మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన పార్వతీశం కథానాయకుడు. ప్రణీకాన్వికా అనే కొత్త అమ్మాయి హీరోయిన్. వియస్ ముఖేష్ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.

టీజర్ విడుదల సందర్భంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ: 'మార్కెట్ మహాలక్ష్మి' మూవీ టీజర్ చూసాను చాలా ఫన్నీ గా ఉంది. హీరో & హీరోయిన్ క్యారెక్టరైజెషన్ బాగుంది. హీరో పార్వతీశం నాకు ఇష్టమైన వ్యక్తి, అతని కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకు వస్తుందని బలంగా నమ్ముతున్నాను. డైరెక్టర్ వియస్ ముఖేష్ చేసిన కొత్త ప్రయత్నాన్ని ప్రతి ప్రేక్షకుడు ఆదరిస్తారని కోరుకుంటూ టీం అందరికి నా ఆల్ ది బెస్ట్.

హీరో 'పార్వతీశం' మాట్లాడుతూ: మా సినిమా టీజర్ ని రీలిజ్ చేసినందుకు “శ్రీ విష్ణు”కు నా కృతజ్ఞతలు. మా టీజర్ మీకు నచ్చితే పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. కమెడియన్ “మహబూబ్ బాషా” మాట్లాడుతూ హీరో శ్రీ విష్ణు మా సినిమా టీజర్ ని లాంచ్ చేసినందుకు నేను చాలా హ్యాపీ. ఎందుకంటే, మార్కెట్ మహాలక్ష్మి లాంటి సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కధలు శ్రీ విష్ణు గారు గతంలో చాలానే చేశారు, చేస్తూనే ఉన్నారు. సో, మా సినిమా టీజర్ అలాంటి వ్యక్తి ద్వారా రీలిజ్ కావడం నాకు ఆనందంగా ఉంది అన్నారు.

త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, సాంగ్స్, ట్రయిలర్ విడుదల ప్రమోషన్ పనులు చేపడతామని, సినిమా విడుదల తేదీ త్వరలో నిర్ణయిస్తామని నిర్మాత అఖిలేష్ తెలిపారు.