మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. కార‌ణం..!

తెలుగు వారికే కాకుండా క‌న్న‌డ వారికి కూడా సుపరిచితం అయిన ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీ కారుపై కొంద‌రు వ్య‌క్తులు రాళ్ల దాడికి పాల్ప‌డారు.  క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారిలో జ‌రిగిన‌ 'బ‌ళ్లారి ఉత్స‌వ్' కార్య‌క్ర‌మంలో పాల్లోని..  తిరిగి వ‌స్తుండ‌గా…

తెలుగు వారికే కాకుండా క‌న్న‌డ వారికి కూడా సుపరిచితం అయిన ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీ కారుపై కొంద‌రు వ్య‌క్తులు రాళ్ల దాడికి పాల్ప‌డారు.  క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారిలో జ‌రిగిన‌ 'బ‌ళ్లారి ఉత్స‌వ్' కార్య‌క్ర‌మంలో పాల్లోని..  తిరిగి వ‌స్తుండ‌గా ఆమె కారుపై దాడి చేశారు. మంగ్లీ గ‌తంలో జ‌రిగిన ఒక‌ కార్య‌క్ర‌మంలో క‌న్న‌డ మాట్లాడ‌లేదంటూ మంగ్లీ కారుపై దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల అనంత‌పురం ప‌క్క‌నే ఉన్న చిక్క‌బ‌ళ్లాపూర్ లో నిర్వ‌హించిన ఒక‌ స‌మావేశంలో పాల్లొన మంగ్లీ తెలుగులో మాట్లాడుతూ 'అంద‌రూ బాగుండారా' అని ప‌ల‌కరించ‌డమే త‌ప్పాయింది.  ఏపీ సరిహద్దు.. ఎక్కువ శాతం తెలుగు మాట్లాడే వారు ఉండే చిక్క‌బళ్లాపూర్ కావ‌డంతో మంగ్లీ  తెలుగులో మాట్లాడితే అదే వేదిక‌పై ఉన్న యాంక‌ర్ అను శ్రీ ఇక్క‌డ క‌న్న‌డ వాళ్లు ఉన్నారు కాబ‌ట్టి క‌న్న‌డ కూడా మాట్లాడాల‌ని సూచించడంతో… మంగ్లీ ఇక్కడ వారికి తెలుగు బాగా తెలుసని అందుకే తెలుగులో చెప్పాన‌ని చెప్పాడంతో కొంద‌రు మంగ్లీ తీరును త‌ప్పుబడుతూ.. సోష‌ల్ మీడియాలో అవేద‌న వ్య‌క్తం చేశారు. బ‌హుశా దాడికే ఇదే ప్రధాన కార‌ణంగా భావిస్తున్నారు.

ఇప్ప‌టికే తెలుగు సినిమా రంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న మంగ్లీ.. క‌న్న‌డ సినిమా రంగంలో కూడా త‌న కంటూ ప్ర‌త్యేక‌మైన స్ధానం సంపాదించుకుంది.