Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలు లేని లోటు మరోసారి తెలిసొచ్చిందా..?

బాలు లేని లోటు మరోసారి తెలిసొచ్చిందా..?

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం లేని లోటు తీర్చలేనిది. ఇదేదో ఇండస్ట్రీ కామన్ గా ఇచ్చిన స్టేట్ మెంట్ కాదు. నిజంగానే ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఎప్పటికప్పుడు ఆ విషయం ప్రూవ్ అవుతూనే ఉంది. తాజాగా అలాంటిదే మరో సందర్భం టాలీవుడ్ కు ఎదురైంది.

సన్నాఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్నారు మోహన్ బాబు. ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను ఈరోజు రిలీజ్ చేశారు. ఆ పాట విన్న వెంటనే అంతా ముక్తకంఠంతో అన్నమాట ఒక్కటే. బాలు లేని లోటు కనిపించిందని. నిజమే.. సంస్కృత, గ్రాంధిక పదాలతో నిండిన ఈ రసరమ్యమైన పాటను బాలు మాత్రమే పాడాలి. ఒకవేళ వేరే గాయకుడు పాడినా బాలు పాడినంత అందం రాదు.

సన్నాఫ్ ఇండియా పాట విషయంలో అదే జరిగింది. రాహుల్ నంబియార్ ఈ పాటను ఆలపించాడు. అతడి ప్రయత్నాన్ని తప్పుబట్టలేం. చక్కగా పాడాడు. వంద శాతం కష్టపడ్డాడనడంలో సందేహం లేదు. కానీ ఏదో లోటు, ఇంకేదో వెలితి. అదే బాలు వాయిస్.

దశాబ్దాలుగా ఇలాంటి పాటల్ని బాలు గొంతుతో విని అలవాటైపోయింది. ఇప్పుడు మరో గొంతుక ఈ తరహా పాటల్లో వినిపిస్తే మానసికంగా జీర్ణించుకోవడం కష్టం అవుతుంది. అంతేతప్ప, ఈ పాటను పాడిన గాయకుడ్ని కించపరచడానికేం లేదు.

కేవలం ఈ ఒక్క పాట సందర్భంలోనే కాదు.. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పాటలొస్తాయి. అప్పుడు కూడా మనకు బాలు గుర్తురావడం గ్యారెంటీ. ఆయన లోటు అలా కళ్లముందు కనిపిస్తుందంతే. మనమేం చేయలేం. బాధపడడం తప్ప. ఇక ఈ పాటను కంపోజ్ చేసినప్పుడు మ్యాస్ట్రో ఇళయరాజా.. ఆ గానగంధర్వుడ్ని ఎన్నిసార్లు తలచుకున్నారో..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?