సూట్ కేస్ పగులగొట్టారు.. హీరోయిన్ అసంతృప్తి!

ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థపై అసహనం వ్యక్తం చేసింది నటి సోనాక్షి సిన్హా. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. తన అసహనాన్ని కూడా ఆసక్తిదాయకంగా వ్యక్తం చేసింది సోనాక్షి.…

ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థపై అసహనం వ్యక్తం చేసింది నటి సోనాక్షి సిన్హా. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. తన అసహనాన్ని కూడా ఆసక్తిదాయకంగా వ్యక్తం చేసింది సోనాక్షి.

'యూ బ్రోక్ ది అన్ బ్రేకబుల్' అంటూ సోనాక్షి ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ అధికారిక అకౌంట్ ను ట్యాగ్ చేసింది.

విమానయాన సంస్థలు సాధారణ ప్రయాణికుల లగేజ్ విషయంలో అయితే ఎలా స్పందిస్తాయో కానీ, ట్వీట్ చేసింది ఒక సెలబ్రిటీ కావడంతో వెంటనే రియాక్ట్ అయ్యింది ఇండిగో.

ఆమెకు సారీ చెబుతూ, ఈ విషయమై బ్యాగేజ్ స్టాఫ్ తో మాట్లాడనున్నట్టుగా ప్రకటించింది! ఒక సెలబ్రిటీ కావడంతోనే ఈ రియాక్షన్ వచ్చిందని చెప్పాలి.

ఇది వరకూ కూడా పలు విమానయాన సంస్థలు బిజినెస్ క్లాస్ సెలబ్రిటీలతోనే ఇలా వ్యవహరించాయి. కొందరు ప్రముఖుల లగేజ్ ను ఒక నగరానికి బదులు మరో నగరానికి పంపించిన దాఖలాలు ఉన్నాయి.

ఇక సామాన్యుల లగేజ్ విషయంలో అయితే ప్రముఖ విమానయాన సంస్థలు కూడా టెన్షన్ పెడుతూనే ఉంటాయి!