Advertisement

Advertisement


Home > Movies - Movie News

'శౌర్య' పోలీస్ వారి హెచ్చరిక

'శౌర్య' పోలీస్ వారి హెచ్చరిక

ప్రస్తుతం ట్రెండ్ ఎలా వుందంటే  సినిమా టైటిల్ తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేయాలి. ప్రతి ఒక్కరూ వెరైటీ టైటిళ్ల కోసం బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. 

లేటెస్ట్ గా ఇలాంటి మరో టైటిల్ రాబోతోంది. నాగశౌర్య హీరోగా కొత్త డైరక్టర్ రాజా తో మహేష్ కోనేరు నిర్మించే సినిమా టైటిల్ ను రేపు అనౌన్స్ చేస్తారు. 

ఈ సినిమా కోసం 'పోలీస్ వారి హెచ్చరిక' అనే వెరైటీ టైటిల్ ఫిక్స్ చేసినట్లు బోగట్టా. దర్శకుడు హరీష్ శంకర్ స్కూలు నుంచి వచ్చిన ఈ కొత్త దర్శకుడు రాజా ఈ సినిమా కోసం పటాస్ లాంటి అవుట్ అండ్ ఫన్ అండ్ యాక్షన్ స్టోరీ రెడీ చేసినట్లు తెలుస్తోంది. 

సినిమాలో శౌర్య పోలీస్ గా కనిపించడు కానీ, అలాంటి వ్యవహారం ఏదో వుంటుందని తెలుస్తోంది.

ఆ ముగ్గురూ ముగ్గురే

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?