శ్రీవిష్ణు- తేడా క్యారెక్టర్

సినిమాల్లో ఎక్కడైనా చిన్న ఫన్ సీన్ లో అమ్మాయిలా హావభావాలు వొలికించడం అన్నది హీరోలకు అలవాటు. సీనియర్ నరేష్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్లు సినిమాలో ఎక్కువ భాగం అమ్మాయి గెటప్ లో నటించిన…

సినిమాల్లో ఎక్కడైనా చిన్న ఫన్ సీన్ లో అమ్మాయిలా హావభావాలు వొలికించడం అన్నది హీరోలకు అలవాటు. సీనియర్ నరేష్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్లు సినిమాలో ఎక్కువ భాగం అమ్మాయి గెటప్ లో నటించిన సందర్భాలు వున్నాయి.

హీరోలు గే క్యారెక్టర్ పోషించిన సందర్భం తక్కువ. కమెడియన్లు అయితే అడ, మగ కానీ గే క్యారెక్టర్లు పోషించి నవ్వులు పుట్టించడం కూడా అలవాటే. కానీ హీరోలు అలాంటి సాహసం చేయడం అరుదు. హీరో శ్రీవిష్ణు మాత్రం ఈ ఫీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రకరకాల పాత్రలు,గెటప్ లు చేయడం అంటే శ్రీవిష్ణుకు చాలా ఇష్టం. అందుకే ఈసారి గే క్యారెక్టర్ ను కూడా ట్రయ్ చేసినట్లు తెలుస్తోంది. గే క్యారెక్టర్ సినిమాలో కనిపించినంత సేపూ చాలా ఫన్ పండినట్లు తెలుస్తోంది. ఒకే సినిమాలో శ్రీవిష్ణు రాజుగా, వయసు మళ్లిన వ్యక్తిగా, యువకుడిగా ఇలా మూడు క్యారెక్టర్లలో కనిపిస్తున్నాడు. అదే టైమ్ లో పలు గెటప్ ల్లో కూడా కనిపిస్తున్నాడు.

వీటన్నింటికి అదనంగా గే గా కాస్సేపు కనిపించి నవ్వించబోతున్నాడు. సినిమా బాగుంటే అన్నీ బాగుంటాయి. సినిమా బాగాలేకపోతే మాత్రం శ్రీవిష్ణుకు అవసరమా ఈ ప్రయోగాలు అనే మాట కూడా వినిపించే అవకాశం వుంది.

9 Replies to “శ్రీవిష్ణు- తేడా క్యారెక్టర్”

Comments are closed.