శ్రీలీల అంటే డాన్స్.. డాన్స్ అంటే శ్రీలీల. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హీరోయిన్లలో ది బెస్ట్ డాన్సర్ గా పేరుతెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ముద్దుగుమ్మ, భగవంత్ కేసరి సినిమాలో మాత్రం పెద్దగా డాన్స్ చేయలేదు. ఆ క్యారెక్టర్ అలాంటిది, పాత్రకు తగ్గట్టు మాత్రమే ఆమె ప్రవర్తించింది.
అయితే సినిమా చూసిన కొంతమంది మాత్రం శ్రీలీల తన స్టోరీ సెలక్షన్ మార్చుకుందేమో, ఇకపై ఆమె నుంచి డాన్స్ మిస్ అవుతుందేమో అని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ఈ హీరోయిన్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
“నేను నటన నేర్చుకున్నదే నాట్యం వల్ల. సో… డాన్స్ అనేది నా జీవితంలో ఓ భాగం. భగవంత్ కేసరి సినిమాతో ఓ ఆర్టిస్ట్ గా కూడా నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే డాన్స్ నంబర్స్ లేకపోయినా ఒప్పుకున్నాను. రాబోయే సినిమాల్లో కచ్చితంగా నా మార్క్ డాన్స్ ఉంటుంది. అదే టైమ్ లో మంచి పాత్రలు కూడా సెలక్ట్ చేసుకుంటాను.”
భగవంత్ కేసరి సినిమాలో సినిమా కథ మొత్తం శ్రీలీల చుట్టూ తిరిగింది. స్కంద సినిమా చూసి శ్రీలీలకు అస్సలు యాక్టింగ్ రాదని విమర్శలు చేసినోళ్లే, ఇప్పుడు భగవంత్ కేసరిలో ఆమె పెర్ఫార్మెన్స్ ను మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాతో తను కోరుకున్నది కూడా అదేనంటోంది శ్రీలీల.
ఇక భగవంత్ కేసరి సినిమాలో కట్ చేసిన సాంగ్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫ్లో కు అడ్డంగా ఉందని తీసేసిన ఆ పాటను… ఎక్కడ యాడ్ చేయాలో తమకే అర్థం కావడం లేదంటున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి.. సినిమాలో పాత్రలతో ఆడియన్స్ ట్రావెల్ చేస్తున్నారని.. ఇలాంటి టైమ్ లో ఆ పాట పెడితే ఫీల్ దెబ్బతింటుందని… అయినప్పటికీ బాలయ్యతో మాట్లాడి, ఎప్పుడు-ఎక్కడ యాడ్ చేయాలనేది త్వరలోనే చెబుతామంటున్నాడు.