అవును.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు

హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే ఆ కిక్కే వేరు. మరీ ముఖ్యంగా యూత్ లో కల్ట్ పెయిర్ గా క్రేజ్ తెచ్చుకున్న జోడీ కలిసిందంటే, ఆ ప్రాజెక్టుకు వచ్చే హైప్ ఓ రేంజ్ లో…

హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే ఆ కిక్కే వేరు. మరీ ముఖ్యంగా యూత్ లో కల్ట్ పెయిర్ గా క్రేజ్ తెచ్చుకున్న జోడీ కలిసిందంటే, ఆ ప్రాజెక్టుకు వచ్చే హైప్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు అలాంటి కాంబినేషన్ ఒకటి సెట్ అయింది.

బేబి సినిమాతో కుర్రకారును కట్టిపడేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి కలిశారు. రవి నంబూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. హీరోహీరోయిన్లు మాత్రమే కాదు, ఈ కొత్త సినిమాతో బేబి సినిమా నుంచి చాలా మంది రిపీట్ అవుతున్నారు.

బేబి సినిమాను డైరక్ట్ చేసిన సాయిరాజేష్, ఈ కొత్త సినిమాకు కథ అందించాడు. పనిలోపనిగా మాటలు-స్క్రీన్ ప్లే కూడా సమకూర్చి పెట్టాడు. అక్కడితో ఆగలేదు. బేబి సినిమా నిర్మాత ఎస్కేఎన్ తో కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నాడు సాయిరాజేశ్.

ఇక బేబి సినిమాకు సూపర్ హిట్ సంగీతాన్నందించిన విజయ్ బుల్గానిన్, ఈ సినిమాకు కూడా వర్క్ చేయబోతున్నాడు. ఇలా బేబి సినిమాకు చెందిన కీలకమైన సభ్యులంతా కలిసి ఓ కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.