వర్కవుట్ చేయడం నచ్చదంటున్న హీరోయిన్

దాదాపు హీరోయిన్లంతా తమ జిమ్ వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అందమైన ఫిజిక్ కోసం తాము ఎంత కష్టపడుతుంటామో పరోక్షంగా చెబుతుంటారు. అయితే శ్రీలీల ఇలాంటి వీడియోలు పెట్టడం ఎప్పుడైనా చూశారా? దీనికి…

దాదాపు హీరోయిన్లంతా తమ జిమ్ వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అందమైన ఫిజిక్ కోసం తాము ఎంత కష్టపడుతుంటామో పరోక్షంగా చెబుతుంటారు. అయితే శ్రీలీల ఇలాంటి వీడియోలు పెట్టడం ఎప్పుడైనా చూశారా? దీనికి ఓ కారణం ఉంది.

తనకు వర్కవుట్స్ పై పెద్దగా ఆసక్తి ఉండదని చెబుతోంది శ్రీలీల. మరి ఈ ముద్దుగుమ్మ ఆ స్లిమ్ ఫిజిక్ ను ఎలా మెయింటైన్ చేస్తోంది? ఆ నాజూకుతనానికి కారణం యోగా అంటోంది ఈ బ్యూటీ.

“నేను యోగా ఎక్కువగా చేస్తాను. వర్కవుట్స్ చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు. యోగానే ఎక్కువగా చేస్తుంటాను. యోగాతో మన బాడీలో ఓ రకమైన ఇంజినీరింగ్ ప్రక్రియ జరుగుతుంది. యోగా అనేది నా లైఫ్ స్టయిల్. రెగ్యులర్ గా యోగా చేయడం వల్ల మన ఆలోచన విధానం, శరీర సౌష్టవం చాలా బాగుంటాయి.”

హైదరాబాద్ లో జరిగిన యోగా మహోత్సవ్ లో పాల్గొంది శ్రీలీల. అందరితో కలిసి కొన్ని యోగాసనాలు వేసింది. ప్రతి ఒక్కరు యోగా చేయాలని కోరుతోంది. సూర్య నమస్కారం లాంటి చిన్న చిన్న ప్రక్రియలతో యోగా మొదలుపెడితే, అది రొటీన్ లైఫ్ లో భాగమౌతుందని, ఆ తర్వాత మరిన్ని యోగాసనాలు ప్రాక్టీస్ చేయొచ్చని సలహా కూడా ఇస్తోంది.

ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రీలీల, ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు చదువు కొనసాగిస్తోంది.