వి సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు హీరో సుధీర్ బాబు. ఆ సినిమా డిజాస్టర్ అయినా, తను హైలైట్ అవ్వాలని ప్రయత్నాలు కూడా చేసారు ఆయన జనాలు. కానీ ఏదీ ఫలితం దక్కలేదు.
ఇప్పుడు అయితే మరో మంచి సినిమా మాత్రం చేతిలోకి వచ్చింది. గతంలో సుధీర్ బాబుతో సినిమా భలే మంచి రోజు సినిమా నిర్మించిన 70ఎమ్ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఓ సినిమా ప్లాన్ చేసింది.
పలాస సినిమాను డైరెక్ట్ చేసిన కరుణ్ కుమార్ దర్శకుడిగా శ్రీదేవి సోడా సెంటర్ అనే చిత్రమైన టైటిల్ లో సినిమా నిర్మించబోతోంది.
పలాస అనే ఊరిపేరుతో కాస్త రా గా సినిమా తీసిన కరుణ్ కుమార్ బాగా ఫెమిలియర్ టైటిల్ అనిపించే శ్రేదేవి సోడా సెంటర్ అనే టైటిల్ ను ఈసారి ఎంచుకోవడం బాగుంది.
మాస్ టైటిల్ లో మాస్ సబ్జెక్ట్ తో తయారయ్యే ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించబోతున్నారు.
తన తొలిసినిమా పలాసకు మంచి పాటలు ఇచ్చిన రఘ కుంచెను దర్శకుడు కరుణ్ కుమార్ ఎందుకు వదిలేసినట్లో? రఘు కుంచి మరీ చిన్న సినిమాలకు తప్ప, కాస్త మీడియం సినిమా అంటే వద్దనుకుంటున్నారా? ఏమిటి?