Advertisement

Advertisement


Home > Movies - Movie News

శ్రీకారం చుట్టుకుంది కొంత సంకల్పానికి

శ్రీకారం చుట్టుకుంది కొంత సంకల్పానికి

ఓ మంచి పాయింట్ తో, ఓ మాంచి రైజింగ్ ఇస్యూ ను తీసుకుని తయారుచేస్తున్న సినిమా శ్రీకారం. 14రీల్స్ పతాకంపై నిర్మించే ఈ సినిమా నుంచి ఒక్కోపాట వదులుతున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన వాటిలో వస్తానంటివో..పోతానంటివో పెద్ద హిట్ అయింది. సంక్రాంతి పాట కూడా జనాలకు నచ్చింది. మిగిలినవి నాట్ బ్యాడ్ అనిపించుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అసలు సినిమా కాన్సె ప్ట్ సాంగ్ ను విడుదల చేసారు.

ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ ఈ పాటను విడదుల చేయడం విశేషం...''శ్రీకారం చుట్టుకుంది కొత్త సంకల్పానికి..కలలు చిగురిస్తున్న సంతోషం ఇది..చినుకు పరిమళమల్లె దీవిస్తున్నది పుడమి..వారసులం మనమేగా, నిన్నటి మొన్నటి పద్దతికి అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాసారు.

బాగా చదువుకున్న హీరో వ్యవసాయాన్ని వృత్తిగా చెపట్టిన తరువాత అందులో ముందుగు సాగే క్రమంలో ఈ పాటను చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. మార్చి 11న విడుదలయ్యే ఈ సినిమాకు దర్శకుడు కిషోర్. నిర్మాతలు రామ్ ఆచంట,,గోపి ఆచంట. శర్వానంద్ సరసన ప్రియాంక నటిస్తోంది మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?