శ్రీలీల మీద మోజు పడుతున్న టాలీవుడ్

శ్రీలీల..శ్రీలీల..శ్రీలీల. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ పేరు ఇది. చిన్న వయసులో వుంది. చలాకీగా వుంటుంది. హుషారు మామూలుగా వుండదు.  Advertisement సెట్ లో చెంగు చెంగున లేడిపిల్లలా గెంతుతూనే వుంటుంది. ఆ…

శ్రీలీల..శ్రీలీల..శ్రీలీల. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ పేరు ఇది. చిన్న వయసులో వుంది. చలాకీగా వుంటుంది. హుషారు మామూలుగా వుండదు. 

సెట్ లో చెంగు చెంగున లేడిపిల్లలా గెంతుతూనే వుంటుంది. ఆ వయసు అలాంటిది. కానీ టాలీవుడ్ అలా వుండదు కదా. ఎలా వలలో వేసుకోవాలా అని చూసే వారు వుంటారు. ఆల్రెడీ వలలో పడిపోయిందని వదంతులు పుట్టించేవారూ వుంటారు.

వరుసగా ఒకే బ్యానర్ లో అయిదారు సినిమాలు చేస్తుండడంతో, ఆ బ్యానర్ నిర్మాత ఈ అమ్మడి మీద మోజు పడుతున్నాడనే పుకార్లు సహజంగానే వచ్చేస్తాయి. కానీ ఇప్పటి వరకు శ్రీలీలతో సినిమా చేయని ఓ టాలీవుడ్ కీ పర్సన్ కూడా ఆమె పై మోజు పడుతున్నారని వార్తలు వినవస్తున్నాయి. 

టాలీవుడ్ లోని అన్ని రంగాల్లో బలంగా వుంటూ, పైకి రాకుండా, తెరవెనుకే చక్రం తిప్పే ఓ కింగ్ పిన్ శ్రీలీల మాట వినిపిస్తే చాలు, కళ్లల్లో మెరుపులు కురిపిస్తున్నారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. గమ్మత్తేమిటంటే శ్రీలీల వయసు కన్నా పెద్ద వయసు కొడుకు వున్నాడు ఇతకాడికి.

శ్రీలీలను తన సినిమాలోకి తీసుకోవాలని, చేతిలో వున్న ప్రాజెక్టు త్వరగా ఫినిష్ చేసి, శ్రీలీలతో సినిమా చేయాలని ఓ యూత్ ఫుల్ దర్శకుడు తెగ హడావుడి పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అయితే శ్రీలీల గురించి క్లోజ్ గా తెలిసిన వారు మాత్రం, వీళ్లెవరు ఆమె కాలి వేలు కూడా టచ్ చేయలేరని, ఆమె ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వుంటుందని చెబుతున్నారు. తన హద్దుల్లో తాను వుంటూ, ఎదుటవారిని ఎక్కడ వుంచాలో అక్కడ వుంచడంలో చిన్న వయసులోనే శ్రీలీల ఫుల్ అవేర్ నెస్ తో వుందని అంటున్నారు టాలీవుడ్ జనాలు.