శ్రీలీల…పాటకు అయిదు కోట్లు

శ్రీలీల..టాలీవుడ్ హాట్ ఫేవరెట్. మహేష్..పవన్..విజయ్ దేవరకొండ ఇలా టాప్ లీగ్ హీరోలు అందరితో సినిమాలు చేస్తోంది. బాలకృష్ణ సినిమాలో ఓ కీలకపాత్ర చేస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమా కోసం…

శ్రీలీల..టాలీవుడ్ హాట్ ఫేవరెట్. మహేష్..పవన్..విజయ్ దేవరకొండ ఇలా టాప్ లీగ్ హీరోలు అందరితో సినిమాలు చేస్తోంది. బాలకృష్ణ సినిమాలో ఓ కీలకపాత్ర చేస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమా కోసం ఓ మాంచి మాస్ సాంగ్ ను ఈ రోజు నుంచి రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. 

ముంబాయి నుంచి వచ్చిన డ్యాన్సర్లు, లోకల్ జూనియర్ ఆర్టిస్ట్ లు ఇలా వందలాది మందితో ఓ మాస్ సాంగ్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. దాదాపు నాలుగైదు రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ వుంటుంది.

సినిమాలో ఓ ఉత్సవం సందర్భంగా ఈ మాంచి మాస్ బీట్ వస్తుందని తెలుస్తోంది. థమన్ ఇచ్చిన క్యాచీ మాస్ ట్యూన్ తో ఈ పాట సాగుతుంది. ఈ ఒక్క పాట కోసం అయిదు కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అరేంజ్ మెంట్స్, కెమేరాలు, లైటింగ్, క్రేన్ ల దగ్గర నుంచి ముంబాయి డ్యాన్సర్లు , వాళ్ల ఫ్లయిట్ టికెట్ లు, అకామిడేషన్, ఫిలిం సిటీ ఫీజులు ఇలా సమస్త ఖర్చులు కలిపి అయిదు కోట్లు దాటేస్తుందట.

సినిమాలో బాలయ్య సరసన కాజల్ నటిస్తోంది. శ్రీలీల పాత్ర ఏమిటి అన్నది మాత్రం సస్పెన్స్ గా వుంచారు. దసరాకు విడుదలవుతున్న ఈ సినిమాకు నిర్మాత సాహు గారపాటి.