రావికొండలరావును అక్కున చేర్చుకున్న సిక్కోలు

రావి కొండలరావు శ్రీకాకుళంలో పుట్టలేదు, కానీ అక్కడే విద్యాబుద్దులు గరిపారు. ఆ వీధుల్లోనే నడయాడారు. అక్కడే నాటకాలు రాసి వేశారు. దాంతో ఆయన్ని తమ జిల్లా వాసిగానీ సిక్కోలు ప్రజలు భావిస్తున్నారు. Advertisement ఆయన…

రావి కొండలరావు శ్రీకాకుళంలో పుట్టలేదు, కానీ అక్కడే విద్యాబుద్దులు గరిపారు. ఆ వీధుల్లోనే నడయాడారు. అక్కడే నాటకాలు రాసి వేశారు. దాంతో ఆయన్ని తమ జిల్లా వాసిగానీ సిక్కోలు ప్రజలు భావిస్తున్నారు.

ఆయన ఈ మధ్య కాలధర్మం చెందితే తమ ప్రాంతంవాడు లేడని వగచి వాపోయారు. ఇపుడు రావి కొండలరావు తీపి గురుతులను ప్రోది చేసి భావితరాలకు అందించాలని అక్కడి సాంస్క్రుతిక సంఘాలు, ప్రజానాయకులు భావించడం గొప్ప విషయం.

శ్రీకాకుళంలో పట్టణంలో రావి కొండలరావు నివసించిన ఒక వీధికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదే విధంగా నాగావళీ తీరం వద్ద ఉన్న మహనీయున విగ్రహాల పక్కన ఈ మరపురాని కళాకారుడి శిలా విగ్రహాన్ని పెట్టాలని కూడా నిర్ణయించడం ఆయనకు నిజమైన అంజలి ఘటించినట్లుగానే చూడాలి.

ఓ ఎస్వీ రంగారావు, రావు గోపాలరావు, రావి కొండలరావు ఇలా అనేకమంది కళాకారులు దివంగతులైతే వారి గురుతులను చెరగనీయకుండా చేయి పెట్టి ఆపుతున్నది సాటి కళాకారులు, అభిమానులేనన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం

పెద్దవారు మరణిస్తే  వారి సంతాప   సభలు, సమావేశాలు ఏర్పాటు చెసి హడావుడి చేసే సినీ పెద్దలు తెరమరగున  పడిన నటులు కాలం చేస్తే పట్టించుకోని సంగతి అందరికీ తెలిసిందే. అలాగే డబ్బు, హోదా, కులం ఉంటేనే గౌరవం ఇస్తున్న సంగతి కూడా విధితమే. ఇక ప్రభుత్వాలు కూడా లాబీయింగ్ చేసుకున్న వారికే అవార్డులు ఇస్తున్నారు.

కానీ జనం గుండెల్లో గూడు కట్టుకున్న వారికి ఈ అవార్డులు, హడావుడి సభల కంటే వారి తరగని ప్రేమే అసలైన పురస్కారాలని అపుడూ ఇపుడూ ఎపుడూ రుజువు అవుతూనే ఉంది. అన్నట్లు రావి కొండలరావు విజయనగరంలోనూ తన బాల్యపు గురుతులు మిగిల్చారు.  అక్కడ కళాకారులు కూడా ఇతోధికంగా ఆ మహానుభావుడి  జ్ఞాపకాలు నిలిపేందుకు ఏదో చేయాలనుకోవడం ఆయన చేసుకున్న పుణ్యమే. నిజానికి ఇంతకంటే ఏ కళాకారుడికైనా ఏం కావాలి. నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించే రంగుల ప్రపంచంతో పోల్చితే  స్వచ్చమైన మమకారాలు ఇవే కదా.

రామ్ గోపాల్ వర్మని మించిన సక్సెస్ ఫుల్ పర్సన్ ఎవరూ లేరు

ఇంట‌ర్ లో ఉన్న‌ప్పుడే అర్జీవీతో నా ప్ర‌యాణం మొద‌లైంది