శ్రీనువైట్ల సినిమాకు ఆదిలోనే కష్టాలు?

దర్శకుడు శ్రీనువైట్ల కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని అనుకున్నారంతా. అవుతుందేమో కూడా. కానీ నిర్మాణం ఇలా మొదలై అలా ఇబ్బందులు మొదలైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను అతిరధ మహారధుల సమక్షంలో ప్రారంభించారు.  Advertisement…

దర్శకుడు శ్రీనువైట్ల కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని అనుకున్నారంతా. అవుతుందేమో కూడా. కానీ నిర్మాణం ఇలా మొదలై అలా ఇబ్బందులు మొదలైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను అతిరధ మహారధుల సమక్షంలో ప్రారంభించారు. 

ఇటలీ షెడ్యూలు మొదలుపెట్టారు. కానీ ఏమైందో ఏమో కానీ ఇప్పుడు కొత్త గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. సినిమా చేతులు మారుతోందని బలంగా వినిపిస్తోంది. నిర్మాతకు హీరో కు మధ్య గ్యాప్ వచ్చిందని, ఆ నిర్మాతతో చేయడానికి హీరో సుముఖంగా లేరని తెలుస్తోంది.

దీంతో ఆ సినిమాకు నిర్మాణ నిర్వహణ బాధ్యతలో వున్న హరీష్ పెద్ది స్వంతగా బ్యానర్ పెడుతున్నారు. ప్రాజెక్టును హరీష్ పెద్ది తన చేతుల్లోకి తీసుకునే అవకాశం వుంది. ఈ మేరకు చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. హరీష్ పెద్ది ఇప్పటి వరకు వేరే సంస్థలో కూడా భాగస్వామిగా వున్నారు. ఈ కొత్త సంస్థతో నిర్మాతగా మారుతున్నారు.

హీరో గోపీచంద్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు వున్నాయి. రెండూ సెట్ మీదనే వున్నాయి. శ్రీను వైట్ల తో సినిమా అనగానే కాస్త ఆసక్తి అయితే వుంది. ఇటలీ నేపథ్యంలో ఇప్పటికే ఒక షెడ్యూలు జరిగింది. మలి షెడ్యూలు ఈ చిక్కు ముడి వీడితే మొదలవుతుంది.