శ్రీను వైట్ల గాయబ్‌… త్రివిక్రమ్‌ నవాబ్‌!

ఒక టైమ్‌లో ఫ్యామిలీ సినిమాని కామెడీతో నింపాలంటే త్రివిక్రమ్‌, శ్రీను వైట్ల మాత్రమే అనుకునేవారు. త్రివిక్రమ్‌ మొదట్నుంచీ స్టారే అయినా, శ్రీను వైట్ల అంచెలంచెలుగా ఎదిగి ఒక టైమ్‌లో విపరీతమైన దూకుడు చూపించాడు. ఓవర్సీస్‌…

ఒక టైమ్‌లో ఫ్యామిలీ సినిమాని కామెడీతో నింపాలంటే త్రివిక్రమ్‌, శ్రీను వైట్ల మాత్రమే అనుకునేవారు. త్రివిక్రమ్‌ మొదట్నుంచీ స్టారే అయినా, శ్రీను వైట్ల అంచెలంచెలుగా ఎదిగి ఒక టైమ్‌లో విపరీతమైన దూకుడు చూపించాడు. ఓవర్సీస్‌ మార్కెట్‌లో అయితే త్రివిక్రమ్‌కి సరిసమానంగా ఎదిగాడు. అయితే శ్రీను వైట్ల ‘ఆగడు’తో పెద్ద ఫ్లాప్‌ చవి చూసిన తర్వాత మళ్లీ తిరిగి లేవలేకపోయాడు.

బ్రూస్‌లీ, మిస్టర్‌, అమర్‌ అక్బర్‌ ఆంటోని లాంటి సినిమాతో శ్రీను వైట్ల పూర్తిగా కనుమరుగైపోయాడు. అజ్ఞాతవాసి చిత్రం ఫ్లాప్‌ అయినపుడు త్రివిక్రమ్‌ పని కూడా అయిపోయిందనే అనుకున్నారు. కానీ వెంటనే జాగ్రత్త పడి ‘అరవింద సమేత’ చిత్రాన్ని ఫెయిల్‌ కాని విధంగా తెరకెక్కించాడు. అతి జాగ్రత్త కారణంగా త్రివిక్రమ్‌ మార్కు వినోదం లేక అది యావరేజ్‌ ఫలితాన్నే చవిచూసింది.

అయితే ‘అల  వైకుంఠపురములో’తో త్రివిక్రమ్‌ తిరిగి తన పొజిషన్‌ చేజిక్కించుకున్నాడు. మరోసారి తనకోసం అగ్ర హీరోలు  బారులు తీరుతున్నారు. రైటర్‌ కావడం వాల్ల త్రివిక్రమ్‌ తన బలాన్ని వాడుకుని నిలబడగలిగితే, ఇతర రచయితలపై ఆధారపడే శ్రీను వైట్ల మళ్లీ నిదొక్కుకోలేకపోయాడు. త్రివిక్రమ్‌లానే మంచి రచయిత అయిన పూరి జగన్నాథ్‌ కూడా పలుమార్లు వెనకబడినా కానీ మళ్లీ, మళ్లీ తన ఉనికి చాటుకోగలిగాడు.