ప్రతి సినిమాకీ మైక్ పట్టుకుని ‘మీ అభిమాన థియేటర్లలో నేడే చూడండి’ అంటూ చేసే ఆటో పబ్లిసిటీలా ఊదరగొట్టేసే విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’కి మాత్రం సైలెంట్‌గా వున్నాడు. నోటా, టాక్సీవాలా చిత్రాలకి కూడా హంగామా చేసిన విజయ్ ‘డబ్ల్యూఎఫ్‌ఎల్’కి మాత్రం పోస్టర్లు ట్వీట్ చేయడం, అవసరం పడితే మైక్‌లో మూడు ముక్కులు మాట్లాడ్డం చేస్తున్నాడు.
ఎందుకింత సైలెంట్‌గా వున్నాడనేది అనుమానాకి తావిస్తోందని తెలిసినా కానీ విజయ్ దేవరకొండ మాత్రం మాటవరసకి కూడా హడావిడి చేయడం లేదు. అయితే ఒకే స్పీచ్‌తో సినిమాకి క్రేజ్ తెచ్చేయాలని తెలివితేటలు చూపించాడు. తాను చేసే చివరి ప్రేమకథ ఇదేనని విజయ్ దేవరకొండ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అక్కడికి ఏదో పదుల కొద్దీ ప్రేమకథలు చేసేసినట్టు, ఇక చేయడానికి ప్రేమకథలే మిగనట్టు మాట్లాడాడు.
డజన్ల కొద్దీ ప్రేమకథ లు చేసినా కానీ అరవయ్యేళ్ల వయసులో కూడా ప్రేమకథలు చేస్తోన్న నటున్నారు. ఓ పది సినిమాలు చేస్తే అందులో అయిదు ప్రేమకథలు చేయక తప్పదు. మళ్లీ ఇంకా చాలా ప్రేమకథలు చేస్తాడనేది విజయ్‌కి కూడా తెలుసు కానీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రేమకథకే తమానికం, ఇందులో నటించాక ఇక చూపించడానికి ప్రేమ మిగలదు అన్న రంగు పూయాలనేది అతని ఎత్తుగడ.
చాలా తెలివిగా మాట్లాడేసానని అనుకున్నాడు కానీ అతని మాటల్లోని డ్లొలతనాన్ని మీడియా కనిపెట్టకుండా లేదు. అసలు ఈ సినిమా పట్ల ఎందుకింత ముభావంగా వుంటున్నాడనేది ఫిబ్రవరి 14న తెలియకుండా పోదు.