కొన్ని విషయాలు ఎవరికీ చెప్పుకోలేనివి ఉంటాయి. మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రతినెలా రుతుస్రావంలో చోటు చేసుకునే మార్పులు వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ బాధలు అనుభవించే వాళ్లకు తప్ప, వినేవాళ్లకు ఏ మాత్రం అర్థం కాదు. ఇప్పుడలాంటి బాధను ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ ఎదుర్కొంటోంది.
ప్రతినెలా తనకు ‘ఆ మూడు రోజులు’ ఓ యుద్ధం చేస్తున్నట్టుగా ఉంటుందని ఆమె ప్రకటించారంటే ఎంత వేదనకు గురవుతుంటుందో అర్థం చేసుకోవచ్చు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శ్రుతి…ఒక్కసారిగా ఆమె తెర ముందుకు వచ్చింది. ఆమె ముఖంలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపించడంతో నెటిజన్లు పలు సందేహాలను వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెట్టారు.
నెటిజన్ల ప్రశ్నలన్నింటికి ఆమె సోషల్ మీడియా వేదికగా సమాధానమిచ్చారు. ‘అవును నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా’ అని ఆమె బహిరంగంగా ప్రకటించి ఊహాగానాలకు తెరదించారు. తాజాగా ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను శారీరకంగా, మానసికంగా ఎంతో వేదనకు గురవుతున్నదో, అందుకు కారణాలేంటో ఆమె వివరించారు.
చాలా మంది నటీమణులు తమ ముఖానికి సర్జరీలు చేయించుకున్నప్పటికీ చేయించుకోలేదని అబద్ధాలు చెబుతారని ఆమె అన్నారు. కానీ తాను వాళ్లలాంటి దాన్ని కాదన్నారు. తన సర్జరీ గురించి నెటిజన్లు చేస్తున్న నెగటివ్ కామెంట్స్‌ను తాను ఖండిస్తున్నట్టు ఆమె వెల్లడించారు.
చివరిగా తాను వేదన అనుభవిస్తున్న సమస్యల గురించి ఆమె ఏకరవు పెట్టారు. ‘పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ , డిస్మెనోరియా సమస్యల వల్ల ప్రతి నెలా రుతుచక్రం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. చాలా మంది మహిళలకు దీని గురించి అవగాహన లేదు. ప్రతినెలా నాకో యుద్ధంలా ఉంటుంది’ అని ఆమె తన వ్యక్తిగత సమస్యలను ఎంతో నిజాయితీగా చెప్పుకొచ్చారు. శ్రుతిహాసన్ సమస్యను సానుభూతితో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బయట వాళ్ళు చూసి పిచ్చోడు వీడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి అనేవాళ్లు