సినిమాల అప్డేట్స్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అప్డేట్స్ కాస్తా లేట్ అయిన అభిమానులు అసలు తట్టుకోలేరు. వారి కోపానికి హీరోల దగ్గర నుండి డైరక్టర్లు, నిర్మాతలు, హీరోయిన్లు అందరు ఇబ్బంది పడల్సిందే. తమ కోపాన్ని మొత్తం సోషల్ మీడియాలో వెళ్లగక్కుతూంటారు.
తాజాగా ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓంరౌత్ పై ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఫైరవుతున్నారు. సినిమా రిలిజ్ దగ్గర వస్తున్న ఇప్పటికీ ప్రమోషన్లు ప్రారంభించకపోవడంపై ఆయనపై మండిపడుతున్నారు. 'వేక్ అప్ ఓం రౌత్' అంటూ #StartAdipurushPromotions ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.
కనీసం శ్రీరామనవమికైనా మూవీ అప్ డేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ చిత్రం ఆగస్ట్ 2022లో విడుదల కావాల్సి ఉంది. కానీ గతేడాది విడుదల చేసిన టీజర్ పై విమర్శలు రావడంతో గ్రాఫిక్స్ ను మరింత తీర్చిదిద్దేందుకు మూవీని వాయిదా వేసిన విషయం తెలిసిందే.