‘శశాంక్’ సినిమాని నిలిపేయండి

త‌మ అభిమాన హీరో సుశాంత్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తున్న ‘శశాంక్’ సినిమాని నిలిపివేయాల‌ని ఆయ‌న అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సీనియ‌ర్ న‌టుడు రాజ్‌బ‌బ్బ‌ర్ త‌న‌యుడు ఆర్యాబబ్బర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం…

త‌మ అభిమాన హీరో సుశాంత్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తున్న ‘శశాంక్’ సినిమాని నిలిపివేయాల‌ని ఆయ‌న అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సీనియ‌ర్ న‌టుడు రాజ్‌బ‌బ్బ‌ర్ త‌న‌యుడు ఆర్యాబబ్బర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజ‌ర్ పోస్ట‌ర్‌ను ఇటీవ‌ల చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో ఆర్యా బ‌బ్బ‌ర్ ముఖంపై ఉరితాడు వేలాడుతూ ఉండ‌డంతో మ‌రిన్ని అభ్యంత‌క‌ర అంశాలున్నాయి.

ముఖ్యంగా మ‌ర్డ‌ర్ ఆర్ సూసైడ్‌, నెపోటిజం, డిఫ్రెష‌న్‌, బాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌, హెరాస్‌మెంట్ అంటూ పోస్ట‌ర్‌పై క్యాప్ష‌న్ ఉండ‌డంతో స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైంది. సుశాంత్ విషాదాంత జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్టు బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికి తోడు పోస్ట‌ర్‌పై అలాంటి సంకేతాలే ఉండ‌డంతో సుశాంత్ కుటుంబ స‌భ్యులు, అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని వెంట‌నే నిలిపివేయాల‌ని వారంతా కోరుతున్నారు.  అంతేకాదు,  ఈ సినిమాతో పాటు చిత్రానికి మద్దతుగా నిలుస్తున్న వారిని బ‌హిష్క‌రించాల‌ని  అభిమానులు డిమాండ్ చేస్తున్నారని సుశాంత్‌ సోదరి శ్వేతాసింగ్‌ ట్విట్టర్‌లో వెల్ల‌డించారు. మున్ముందు ఈ సినిమా వివాదాస్ప‌దంగా మార‌నున్న సంకేతాలు వెల్ల‌డ‌వుతున్నాయి. 

పవన్ సార్ గురించి ఏం చెప్పాలి