సోలో బతుకే సో బెటరూ అంటూ సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేసాడు దర్శకుడు సుబ్బు. కానీ తరువాత ఇంకా సినిమా లేదు. ఇప్పటికి సెట్ అయింది. హీరో అల్లరి నరేష్ తో సినిమా రేపు అనౌన్స్ చేస్తున్నారు.
గతంలో నాంది సినిమా నిర్మాణంలో పాలు పంచుకుని, లేటెస్ట్ గా సామజవరగన హిట్ సినిమాను అందించిన రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తారు.
తొలిసారి అల్లరి నరేష్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. అది కూడా 1980 బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ ఫిల్మ్ లో నటిస్తున్నారు. దర్శకుడు సుబ్బు తన స్వంత ఊరు ఈస్ట్ గోదావరి తుని నేపథ్యంలో ఓ కథ రాసుకున్నారు. దాన్ని తెరకెక్కించాలని సోలో బతుకే సినిమా విడుదల అయిన దగ్గర నుంచి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది హీరోలకు ఈ కథ చెప్పారు. కానీ ఎందుకో సెట్ కాలేదు.
ఇప్పుడు ఈ కథ నరేష్ కు నచ్చింది. ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయింది. మొత్తం మీద సుబ్బుకు సినిమా వచ్చింది.