సమంత..చైతన్య..ఎవరికి వారే అన్నట్లు వుంటున్నారు అని రూమర్లే రూమర్లు. నా సినిమాలు వేరు..పర్సనల్ వేరు. అంటూ అర్థం అయ్యీ..అయినట్లు, కానట్లు, ఏదో చెప్పడం తప్ప క్లారిటీ లేదు.
సమంత తన మానాన తాను తన పోస్ట్ లతో తాను ముందుకు వెళ్తోంది. చైతన్య తన సినిమాలతో తాను ముందుకు వెళ్తున్నాడు.
లవ్ స్టోరీ సక్సెస్ అయినా సమంత నుంచి ఒక ట్వీట్ లేదు. పోస్ట్ లేదు. ఇది చాలదన్నట్లు, సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ పార్టీ చేసుకుంటూ సమంత జాడలేదు.
అక్కినేని ఫ్యామిలీకి సమంత దూరంగా వుందా? దూరమైందా? అన్న అనుమానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. జనాలు అంతా దీని మీద మాట్లాడుకునేలా చేసింది.
అక్కినేని ఫ్యామిలీ పార్టీ లవ్ స్టోరీ టీమ్ సక్సెస్ పార్టీ మరోసారి సమంత-చైతూల మధ్య పెరుగుతున్న దూరాన్ని మీడియాలోకి తెచ్చింది.