తను నిర్వహిస్తున్న కార్యక్రమానికి హయ్యస్ట్ టీఆర్పీ తెచ్చేందుకు కలిసొచ్చే ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టడం లేదు ఎన్టీఆర్.
ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం కోసం వరుసపెట్టి సెలబ్రిటీల్ని హాట్ సీట్ లోకి తీసుకొస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రభాస్ పై కన్నేసింది టీమ్.
పాన్ ఇండియా హీరో ప్రభాస్, టీవీ కార్యక్రమాలకు పెద్దగా హాజరుకాడు. ఇప్పటివరకు వచ్చిన ఎన్నో ఆఫర్లను సున్నితంగా తిరస్కరించాడు. మరి ఇలాంటి హీరో ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి వస్తాడా అనేది సందేహం.
ప్రస్తుతానికైతే నిర్వహకులు ప్రభాస్ టీమ్ తో చర్చలు ప్రారంభించారు. ఎన్టీఆర్ రంగంలోకి దిగితే పనైపోద్ది అనేది పక్కా.
ఈ కార్యక్రమాన్ని రామ్ చరణ్ తో లాంఛ్ చేశాడు ఎన్టీఆర్. ఆ తర్వాత రాజమౌళి-కొరటాల ను తీసుకొచ్చాడు. త్వరలోనే మహేష్ బాబును కూడా హాట్ సీట్ లో కూర్చోబెట్టబోతున్నాడు. దీనికి సంబంధించిన షూట్ కూడా పూర్తయింది.
ఇలా వారానికో ప్రత్యేక అతిథిని తీసుకొచ్చి షోను రక్తికట్టిస్తున్న ఎన్టీఆర్, త్వరలోనే ప్రభాస్ ను కూడా హాట్ సీట్ లోకి తీసుకురాబోతున్నాడు.
ప్రస్తుతం టెలివిజన్ రంగంలో నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్-5కు, ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి మధ్య టీఆర్పీ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
జానర్స్ పరంగా రెండూ ప్రత్యేకమైన కార్యక్రమాలైనప్పటికీ.. ఇద్దరు హీరోలు, రెండు వేర్వేరు ఛానెల్స్ లో చేస్తుండడంతో సహజంగానే పోటీ నెలకొంది. ప్రతి వారం ఈ రెండు కార్యక్రమాల మధ్య టీఆర్పీ యుద్ధం జరుగుతోంది.