రష్మిక పేరు చెబితే చాలు, టోటల్ కన్నడ ఇండస్ట్రీ మొత్తం మండిపడుతోంది. కాంతార చూడలేదన్న ఒకే ఒక్క స్టేట్ మెంట్ తో శాండిల్ వుడ్ కు బద్ధశత్రువుగా మారిపోయింది రష్మిక. ఎలాగోలా మెల్లగా ఆ వివాదం సద్దుమణిగిందన్న టైమ్ లో, రొమాంటిక్ సాంగ్స్ సౌత్ నుంచి పెద్దగా రావు, అన్నీ మసాలా పాటలే వస్తాయంటూ మరో వివాదాస్పద వ్యాఖ్య చేసింది.
ఇలా ఎప్పటికప్పుడు తమ కామెంట్స్ తో కాంట్రవర్సీలకు కేంద్ర బిందువు అవుతున్న రష్మికకు, సీనియర్ హీరో సుదీప్ అండగా నిలిచాడు. ప్రస్తుతం ఆమె నేర్చుకునే స్టేజ్ లో ఉందని, మెల్లగా ఒక్కొక్కటి నేర్చుకుంటుందని చెబుతున్నాడు.
“ఒక్కసారి పబ్లిక్ ఫిగర్ అయితే పూల దండలతో పాటు గుడ్లు-టమాటాలు కూడా ఉంటాయి. అవన్నీ ఫేస్ చేసినప్పుడే స్ట్రాంగ్ అవుతాం. ఇలాంటి వివాదాలు మనల్ని మరింత బెటర్ గా మారుస్తాయి. ప్రస్తుతం ఆమె ఇలాంటి వివాదాల్ని ఎదుర్కొనే స్టేజ్ లో ఉంది. ఇదొక దశ.”
ఇదే టైమ్ లో రష్మికపై చిన్న సెటైర్ కూడా వేశాడు సుదీప్. ఇనస్టాగ్రామ్, ట్విట్టర్ లో లక్షల్లో ఫాలోవర్స్ కోరుకునే రష్మిక, ఇలాంటి నెగెటివిటీని కూడా స్వీకరించాల్సి ఉంటుందన్నాడు. పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వస్తున్నప్పుడు, ఇలాంటి వివాదాలు కూడా వస్తుంటాయని, వాటిని యాక్సెప్ట్ చేయాలని చెబుతున్నాడు.