కాపీ ఆరోపణలపై స్పందించిన ‘సాహో’ దర్శకుడు!

ఫ్రెంచి సినిమా 'లార్గోవించ్' ను స్ఫూర్తి పొంది 'సాహో'ను రూపొందించారనే విశ్లేషణ తొలి రోజు, తొలి షో.. థియేటర్ నుంచినే ప్రారంభం అయ్యింది. మామూలుగా అయితే సామాన్య ప్రేక్షకులు ఆ విషయాన్ని త్వరగా గుర్తించే…

ఫ్రెంచి సినిమా 'లార్గోవించ్' ను స్ఫూర్తి పొంది 'సాహో'ను రూపొందించారనే విశ్లేషణ తొలి రోజు, తొలి షో.. థియేటర్ నుంచినే ప్రారంభం అయ్యింది. మామూలుగా అయితే సామాన్య ప్రేక్షకులు ఆ విషయాన్ని త్వరగా గుర్తించే వాళ్లు కాదు. ఎవరో ఎనలిస్టులు మాత్రమే పట్టేసేవారు. కానీ తెలుగులో అప్పటికే 'అజ్ఞాతవాసి' రూపంలో లార్గోవించ్ ను కాపీ కొట్టి ఉండటంతో… 'సాహో' అందరికీ దొరికిపోయాడు.

అయితే 'అజ్ఞాతవాసి'తో పోలిస్తే 'సాహో' చాలారెట్లు బెటర్ అనే ఫీలింగ్ ఉంటుంది ఈ సినిమా చూసిన వారికి. ఇక ఈ అంశం గురించి మాట్లాడాడు దర్శకుడు సుజిత్. తమను కాపీ అని నిందించే వారిలో చాలామంది ఒరిజినల్ వెర్షన్ చూసి ఉండరని సుజిత్ అంటున్నాడు. ఈ కాన్సెప్ట్ తో బోలెడన్ని సినిమాలు వచ్చాయని అంటున్నాడు ఈ దర్శకుడు. లార్గోవించ్ ను కాపీ కొట్టామని తమను అనే వాళ్లను.. రెండో సినిమాల స్క్రీన్ ప్లేలో ఏమైనా సాపత్యం ఉందా? అని ఈ దర్శకుడు ప్రశ్నిస్తున్నాడు.

'సాహో' లెంగ్త్ ఎక్కువైంది, మాడిఫికేషన్స్ వంటి సలహాలకు సుజిత్ విలువ ఇవ్వడం లేదు. సినిమా థియేటర్లోకి వెళ్లాకా మార్పులు చేయడం అంటే సినిమా బాగోలేదని ఒప్పుకున్నట్టే అని సుజిత్ అంటున్నాడు. చిన్న వయసులోనే భారీ బడ్జెట్ సినిమాను డీల్ చేసినా సుజిత్ తను తీసిన దానికి అయితే కట్టుబడి ఉన్నట్టుగా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. 

తెలుగులో సినీప్రియుల రూటు మారింది