ఫెయిల్యూర్ పాపం మీడియా మీద

సినిమా హిట్ అయితే తన గొప్ప బాగా లేదంటే మీడియా ప్రాపగండా అన్నట్లు వుంది డైరక్టర్ సుజిత్ వ్యవహారం. సినిమా విడుదలయిన తరువాత కానీ ముందు కానీ మీడి ముందుకు రాని సుజిత్, సైలెంట్…

సినిమా హిట్ అయితే తన గొప్ప బాగా లేదంటే మీడియా ప్రాపగండా అన్నట్లు వుంది డైరక్టర్ సుజిత్ వ్యవహారం. సినిమా విడుదలయిన తరువాత కానీ ముందు కానీ మీడి ముందుకు రాని సుజిత్, సైలెంట్ ఓ సెక్షన్  ఆఫ్ మీడియాతో మాట్లాడాడు. అప్పుడు కూడా మీడియా సినిమాను ఓవర్ గా ఊహించుకుని డిస్సపాయింట్ అయిందని, మీడియాకు ఏదో మాటర్ వుండాలి కాబట్టి సాహో మీదే రాస్తోందని, ఇలా రకకరాలుగా వాపోయారు. కానీ జనాలు సాహో సినిమా చూసి ఏమంటున్నారన్నది మాత్రం ఆయనకు తెలియనట్లుగా వుంది.

*రివ్యూ రాసేవాళ్లు సినిమాను సినిమాలా చూడకుండా కొంచెం పర్సనల్ అయ్యారేమో
*రివ్యూలు ఒకటి రెండు రోజులు ఆపితే బాగుండేదేమో?
*రివ్యూవర్లు రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నారు.
*లార్గోవించ్ కాపీ అనేవారిలో చాలా మంది అస్సలు ఆ సినిమా చూసే వుండరు.
*తరువాత సినిమా వరకు ఫీడింగ్ కావాలి. అందుకే సాహోనే వాడుకుంటున్నారు.
*ఈ సినిమా ద్వారా ఇంటెల్ జెన్సీని తగ్గించుకుని,, ప్రతి విషయం ఒలిచి చెప్పాలి అని నేర్చుకున్నా.

ఈ డైలాగులు అన్నీ డైరక్టర్ సుజిత్ వే. రివ్యూవర్ల మీద, మీడియా మీద పడే బదులు, సుజిత్ థియేటర్ల టూర్ కు వెళ్లవచ్చు కదా? జనాలే చెబుతారు సినిమా ఎలా వుందో? ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తున్న థియేటర్లు చెబుతాయి, సుజిత్ ఎంత గొప్ప సినిమా తీసాడో?

తెలుగులో సినీప్రియుల రూటు మారింది