సుజిత్-నాని క్రేజీ కాంబినేషన్

మరో క్రేజీ కాంబినేషన్ కు తెరలేస్తోంది. సాహొ సినిమాతో తనకు ఓ స్టయిల్ వుందని నిరూపించుకున్నాడు రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్.  Advertisement లేటెస్ట్ గా ఓజి సినిమాను పవన్ కళ్యాణ్ తో…

మరో క్రేజీ కాంబినేషన్ కు తెరలేస్తోంది. సాహొ సినిమాతో తనకు ఓ స్టయిల్ వుందని నిరూపించుకున్నాడు రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్. 

లేటెస్ట్ గా ఓజి సినిమాను పవన్ కళ్యాణ్ తో చేస్తున్నాడు. ఈ సినిమా సెట్ మీద వుండగానే మరో చాన్స్ ను పట్టేసాడు. నాని హీరోగా ఓ ప్రాజెక్ట్ ఓకె చేయించుకున్నారు. దీనికి కూడా డివివి దానయ్య నే నిర్మాత.

నాని తరువాత సినిమా కోసం ముగ్గురు డైరక్టర్లు లైన్ లో వున్నారు. దసరా డైరెక్టర్, బలగం డైరక్టర్ లైన్ లు చెప్పి వున్నారు. అలాగే తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కూడా నాని కోసం ఓ సబ్జెక్ట్ పట్టుకుని వున్నారు. వీరందరూ ఇలా వుండగానే సుజిత్ కు అవకాశం ఇచ్చారు నాని.

నాని కోసం సుజిత్, ఫుడ్ మాఫియా బ్యాక్ డ్రాప్ కథ తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇద్దర్ మధ్య జరిగే పోరు నేపథ్యంలో  కథ వుంటుందని వార్త వినిపిస్తోంది. ఓజి సినిమా ఫినిష్ చేసి సుజిత్ ఈ ప్రాజెక్ట్ మీదకు వస్తారు.