సుక్కు..ఆకస్మిక అమెరికా ప్రయాణం

దర్శకుడు సుకుమార్ ఆకస్మికంగా అమెరికా ప్రయాణమై వెళ్లిపోయారు. అదేం పెద్ద విషయం. పని వుండి వెళ్లి వుంటారు. అని అనేయడం సులువే. కానీ ఆయన అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని హుటాహుటిన వెళ్లినట్లు తెలుస్తోంది. నిజానికి…

దర్శకుడు సుకుమార్ ఆకస్మికంగా అమెరికా ప్రయాణమై వెళ్లిపోయారు. అదేం పెద్ద విషయం. పని వుండి వెళ్లి వుంటారు. అని అనేయడం సులువే. కానీ ఆయన అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని హుటాహుటిన వెళ్లినట్లు తెలుస్తోంది. నిజానికి సుకుమార్ రైటింగ్స్ సినిమా షూట్ ప్రారంభం వుంది శుక్రవారం నాడు. కానీ దానికి డుమ్మా కొట్టి మరీ అమెరికా వెళ్లారు.

దీని మీద రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. మార్నింగ్ కేజీఎఫ్ 2 సినిమా చూసారు. ఆ టేకింగ్, ఆ భారీతనం, ఆ విజువల్స్ చూసి చాలా మందికి బుర్రలు తిరిగిపోయాయి. పుష్ప 2 ప్లానింగ్ లోవున్నారు సుకుమార్. ఇప్పుడు ఏం తీసినా ఆర్ఆర్ఆర్ కు లేదా పుష్పకు మించి తీయాలి. 

తీయాలి అని అనుకోవడం వేరు. ఆ రేంజ్ లో ఆలోచించి చేయడం వేరు. అందుకే కేజీఎఫ్ 2 చూసిన తరువాత సుకుమార్ ఇక్కడే వుండి స్క్రిప్ట్ ఆలోచన అన్న ఐడియాను పక్కన పెట్టి హుటాహుటిన అమెరికా వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే వినిపిస్తున్న మరో గ్యాసిప్ ఏమిటంటే దాదాపు ఇండస్ట్రీలోని పాపులర్, ఫేమస్, టాప్ డైరక్టర్లు అంతా తొలి రోజు తొలిఆట కు కేజీఎఫ్ 2 ను చూసారు. వారెవ్వరికీ కేజీఎఫ్ 2 నచ్చలేదని తెలుస్తోంది. 

మేధావి వర్గ దర్శకుడు అనిపించుకునే ఓ దర్శకుడు తన నిర్మాత, మ్యూజిక్ డైరక్టర్ తో కలిసి సినిమా చూసారు. కానీ మరో రెండుమూడు నిమషాలు వుంది అనగానే థియేటర్ నుంచి వెళ్లిపోయారు. అలాగే సెలబ్రిటీ డైరక్టర్లు వారిలో వారు ఏముందీ సినిమాలో అని కామెంట్లు చేసుకోవడం విశేషం.