Advertisement

Advertisement


Home > Movies - Movie News

సుకుమార్ అంటే అంతేనా నానీ?

సుకుమార్ అంటే అంతేనా నానీ?

హీరో నాని ఓ అద్భుతమైన స్టేట్ మెంట్ ఇచ్చారు. మీడియా ఇంటాక్షన్ లో ఓ ప్రశ్నకు నాని సమాధానం ఇస్తూ… పుష్ప టైమ్ కు సుకుమార్ ఒక్క భాషలో బాగా పరిచయం నాలుగు భాషల్లో పరిచయం కాదు, దసరా దర్శకుడు శ్రీకాంత్ అయిదు భాషల్లో పరిచయం కాదు. అంతే తేడా’ అన్నారు. 

ఇది కొంచెం సుకుమార్ స్థాయిని తక్కువ చేయడమే. మీడియా అడిగిన ప్రశ్న ఏమిటంటే, హీరోలు చాలా మంది రాజ‌మౌళి, సుకుమార్ లాంటి అనుభవం కలిగిన వారితో పాన్ ఇండియా లెవెల్ కు వెళ్లారు. కానీ నాని కొత్త దర్శకుడితో పాన్ ఇండియా లెవెల్ కు ట్రయ్ చేస్తున్నారు, ఏమిటి ధీమా అన్నది. దానికి నాని సమాధానం అది.

కానీ పుష్ప టైమ్ కు సుకుమార్ కేవలం ఒక్క భాషలోనే పరిచయం అని అనడం కరెక్ట్ కాదేమో? సుకుమార్ అప్పటికే మాంచి సినిమాలు తీసారు. వాటిని హిందీ లోకి డబ్ చేయడం జ‌రిగింది. రంగస్థలం సినిమా రేంజ్ ఎలాంటిది? ఆర్య సినిమాను ఇతర భాషల్లో కూడా చూసారు. యూ ట్యూబ్ లో, ఓటిటి లో సుకుమార్ పేరు చాలా భాషల వారికి పరిచయం. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.

అలాంటిది సుకుమార్ పుష్ప ముందు కేవలం తెలుగువారికి మాత్రమే తెలుసు అని నాని అనడం కచ్చితంగా తప్పే అవుతుంది. ఈ మధ్య హీరో నాని ప్రకటనలు కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నట్లు కనిపిస్తున్నాయి అనే టాక్ ఇండస్ట్రీలో వుంది. అంతా బాగుంటే ఇవన్నీ నడిచిపోతాయి. కానీ వన్స్ తేడా వస్తే మాత్రం ట్రోలింగ్ అంటూ ఓ రేంజ్ లోకి చేరుతాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?