అక్కినేని హీరోల్లో కనుముక్కు తీరుగా, పెర్ ఫెక్ట్ గా వున్నవాడు, తాత పోలికలు కాస్త పుణికి పచ్చుకున్నవాడు సుమంత్. కానీ ఎందుకో లక్ కలిసిరాలేదు. కెరీర్ సజావుగా సాగడం లేదు. అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు కానీ గుర్తింపు సరిగ్గా రావడం లేదు.
ఇక ఎన్నాళ్లో హీరోగానే కొనసాగడం కష్టం కూడా. ఎందుకంటే జనాల టేస్ట్ లు మారుతున్నాయి కదా. ఇలా హీరోగా సెటిల్ కాలేని చాలా మంది వేరే రూట్లోకి వెళ్లి మంచి నటులుగా కొనసాగుతున్నారు. కానీ ఇన్నాళ్లు సుమంత్ ఆ ప్రయత్నం చేసినట్లు లేదు.
తొలిసారి హీరోగా కాకుండా ఓ మంచి పాత్రను చేస్తున్నాడు సీతారామం సినిమాలో. హను రాఘవపూడి డైరక్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా స్వప్న సినిమాస్ పతాకంపై తయారవుతోందీ సినిమా. ఈ సినిమాలో సుమంత్ బ్రిగేడియర్ విష్ణుశర్మ అనే పాత్ర చేస్తున్నారు.’’ బ్రిగేడియర్ విష్ణు శర్మ చాలా క్లిష్టమైన పాత్ర. చాలా కోణాలు వుంటాయి. స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాత అద్భుతం అనిపించింది. ఇలాంటి పాత్రలు సాదారణంగా రావు. ఇది నెగిటివ్ పాత్ర కాదు. కానీ వైవిధ్యంగా వుంటుంది.ఒక సవాల్ తో కూడుకున్న పాత్ర. ఆ సవాల్ నచ్చే ఒప్పుకున్నా…’’ అంటున్నాడు సుమంత్.
ఇలాంటి పాత్రలు సుమంత్ చేయడానికి ఒప్పుకోవాలే కానీ చాలా మంది అడిగే అవకాశం వుంది. ఎందుకంటే సరైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల కోసం ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది.