సమ్మర్ ఓపెనింగ్ అనేది టాలీవుడ్ సినిమాలకు వరం. ఆ తరువాత సినిమా బాగుంటే రన్నింగ్ కూడా అదే రేంజ్ లో వుంటుంది. సరైన ఓపెనింగ్ పడితే సినిమా కాస్త అటు ఇటుగా వున్నా బయ్యర్లు గట్టెక్కిపోతారు.
నాని దసరా సినిమా అలాంటి ఓపెనింగ్ తెచ్చుకుంది. సమ్మర్ స్టార్టింగ్ లో వచ్చి, సరైన డేట్ అనిపించుకుని, మాంచి ఓపెనింగ్ అందుకుంది. నైజాం, ఓవర్ సీస్ లో ఆ ఊపు కంటిన్యూ చేసుకుంది. ఆంధ్ర లో డౌన్ అయినా మెల్లగా బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా లాగుతోంది. ఈ వారం సినిమాలు పెద్దగా క్లిక్ కాకపోవడంతో దసరా కు కాస్త షేర్ వస్తోంది. చూస్తుంటే టోటల్ గా ఓ పది, ఇరవై శాతం ఇటుగా దసరా బయ్యర్లు టార్గెట్ కు దూరంగా వుండేలా వున్నారు.
దసరా తరువాత మళ్లీ అలాంటి సూపర్ ఓపెనింగ్ దేనికి అని ప్రశ్నించుకుంటే ఏజెంట్ సినిమా ఒక్కటే కనిపిస్తోంది. దసరా సినిమా తరువాత రావణాసుర వచ్చింది కానీ ఆ రేంజ్ ఓపెనింగ్ రాలేదు. తరువాత వారంలో సమంత శాకుంతలం విడుదలవుతోంది. ఇప్పటి వరకు కనిపిస్తున్న బజ్ ను చూస్తుంటే ఆ సినిమాకు కూడా దసరా సినిమా రేంజ్ ఓపెనింగ్ వచ్చేలా లేదు.
ఆ పై వారం సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా వుంది. థ్రిల్లర్ సినిమా. అది ఇంకా పబ్లిసిటీ అందుకోలేదు. హీరో అండ్ అదర్స్ రంగంలోకి దిగాల్సి వుంది. ఇక మిగిలింది అఖిల్ ఏజెంట్. ఈ సినిమాకు పెద్దగా హడావుడి చేయడం లేదు కానీ సినిమా ఫ్యాన్స్ లో కొంత క్రేజ్ అయితే వుంది. విడుదల డేట్ దగ్గరకు వెళ్లేసరికి మంచి బజ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
డిఫరెంట్ సినిమా, సురేందర్ రెడ్డి డైరక్షన్ ఇలా అన్నీ కలిసి అఖిల్ ఏజెంట్ కు మంచి ఓపెనింగ్ ఇవ్వడం అన్నది పక్కా. అయితే అది దసరా సినిమా రేంజ్ లో వుంటాయా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.