అప్పుడెప్పుడో ఆరేళ్ల కిందట కలిసి సినిమా చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ కాంబినేషన్ సెట్ అయింది. హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ మరోసారి కలిశారు. కొత్త సినిమా స్టార్ట్ చేశారు. 2016లో వచ్చిన టైగర్ మూవీ తర్వాత సందీప్-ఆనంద్ కాంబోలో వస్తున్న సినిమా ఇదే.
కాస్త సైన్స్ ఫిక్షన్ టచ్ ఉండేలా సస్పెన్స్ థ్రిల్లర్లు తీయడం వీఐ ఆనంద్ స్పెషాలిటీ. రవితేజతో డిస్కోరాజా కూడా అలానే తీశాడు. కానీ రిజల్ట్ తేడా కొట్టింది. అప్పట్నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు.. మరోసారి సందీప్ కిషన్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. ఈ సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లరే. కాకపోతే సైన్స్-ఫిక్షన్ టచ్ ఉంటుందా ఉండదా అనేది తేలాల్సి ఉంది.
ఈ కొత్త సినిమాతో హాస్య మూవీస్ అనే బ్యానర్ ఇండస్ట్రీకి పరిచయమౌతోంది. లాంఛింగ్ కు అల్లరి నరేష్, నాగశౌర్య ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. అల్లరోడు క్లాప్ కొడితే, శౌర్య కెమెరా స్విచాన్ చేశాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించబోతోంది.
రీసెంట్ గా సందీప్ కిషన్ హీరోగా గల్లీ రౌడీ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. ఈ టాక్ తో సంబంధం లేకుండా వెంటనే కొత్త సినిమాను లైన్లో పెట్టాడు సందీప్. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలోకి వస్తుంది.