కొన్నేళ్ల కిందటి సంగతి. అర్జున్ రెడ్డి పెద్ద హిట్టయిన తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ మేరకు ఇద్దరి మధ్య కథాచర్చలు కూడా జరిగాయి. ఆ టైమ్ లోనే ఓ గాసిప్ పుట్టుకొచ్చింది. మహేష్ తో చేయబోయే సినిమాకు సందీప్ రెడ్డి.. షుగర్ ఫ్యాక్టరీ అనే టైటిల్ పెట్టినట్టు కథనాలు వచ్చాయి. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు వంగా.
“షుగర్ ఫ్యాక్టరీ అనేది ఓ డిఫరెంట్ స్టోరీ. 4-5 క్యారెక్టర్లు కలిపితే ఓ స్టోరీ. నేను రాసుకున్న మొట్టమొదటి స్టోరీ అది. చాలా ఏళ్ల కిందట రాశాను. అది మహేష్ కు సరిపడే స్టోరీ కాదు. మహేష్ తో ఓ ఫ్రెష్ సబ్జెక్ట్ తో సినిమా చేస్తాను. మహేష్ కు ఆల్రెడీ ఓ కథ చెప్పాను. కచ్చితంగా ఆ కథతో మహేష్ హీరోగా సినిమా చేస్తాను.”
ఇలా మహేష్ తో చేయబోయే సినిమా మేటర్ బయటపెట్టాడు సందీప్ రెడ్డి వంగ. మహేష్ తో తను చేయబోయే సినిమా ఆగిపోలేదని, కేవలం టైమ్ సెట్ అవ్వక మాత్రమే ఆ సినిమా ఆగిందని అంటున్నాడు సందీప్. ఇద్దరికీ ఫ్రీ టైమ్ దొరికితే ఆ ప్రాజెక్టు పట్టాలపైకి వచ్చేస్తుందంటున్నాడు.
“నిజానికి అర్జున్ రెడ్డి తర్వాత మహేష్ సినిమానే అవ్వాలి. కానీ టైమ్ కుదరలేదు. మహేష్ వేరే ప్రాజెక్టుతో గ్యాప్ రావడంతో నేను బాంబే వెళ్లిపోయాను. అక్కడ హిందీ సినిమా పూర్తిచేసేసరికి, మహేష్ మరో సినిమాకు కమిట్ అయిపోయారు. ఇలా డిలే అయిపోతోంది. ఇప్పుడు కూడా నేను మరో హిందీ సినిమా చేస్తున్నాను. ఆయన ఇంకో సినిమాతో బిజీ. ఇలా ఇద్దరికీ టైమ్ కుదరడం లేదు. మా ఇద్దరికీ కావాల్సింది కేవలం స్పేస్ మాత్రమే. ఆ టైమ్ దొరికితే సినిమా కచ్చితంగా ఓకే అయిపోతుంది.”
మహేష్ కు చెప్పిన కథ రిజెక్ట్ అవ్వలేదంటున్నాడు సందీప్ వంగ. మహేష్ బిజీగా ఉన్నాడు కాబట్టి, ఆ కథను మరో హీరోతో చేసే ఉద్దేశం కూడా తనకు లేదంటున్నాడు.