ఈ బాలీవుడ్ నటుడు మనకు కలిసిరాడేమో!

అదేంటో కొంతమంది రావడమే దురదృష్టాన్ని పాకెట్ లో పెట్టుకొని వస్తారు. తమకు తెలియకుండానే నెగెటివ్ సెంటిమెంట్ ను క్యారీ చేస్తారు. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి ఈ కోవకు చెందినవాడే. హిందీలో ఎన్నో…

అదేంటో కొంతమంది రావడమే దురదృష్టాన్ని పాకెట్ లో పెట్టుకొని వస్తారు. తమకు తెలియకుండానే నెగెటివ్ సెంటిమెంట్ ను క్యారీ చేస్తారు. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి ఈ కోవకు చెందినవాడే. హిందీలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈ నటుడు.. సౌత్ కు వచ్చేసరికి మాత్రం నెగెటివ్ సెంటిమెంట్ గా తయారయ్యాడు.

ఆమధ్య సుదీప్ హీరోగా వచ్చిన పహిల్యాన్ అనే సినిమా చేశాడు సునీల్ షెట్టి. పాన్ ఇండియా లెవెల్లో రిలీజైన ఆ మూవీ సుదీప్ కు బొత్తిగా కలిసిరాలేదు. ఆ తర్వాత రజనీకాంత్ తో దర్బార్ సినిమా చేశాడు. అది కూడా తమిళనాట రజనీకాంత్ రేంజ్ లో ఆడలేదు. తెలుగులో ఫ్లాప్.

ఇక రీసెంట్ గా తెలుగులో మోసగాళ్లు అనే స్ట్రయిట్ మూవీ చేశాడు సునీల్ శెట్టి. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇలా కన్నడ-తమిళ-తెలుగు భాషల్లో ఫ్లాప్స్ అందుకున్నాడు ఈ నటుడు.

సెంటిమెంట్స్ ఎక్కువగా ఫాలో అయ్యే టాలీవుడ్ జనాలు, భవిష్యత్తులో ఈ సీనియర్ బాలీవుడ్ నటుడ్ని యాక్సెప్ట్ చేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు సునీల్ శెట్టి.