బిడ్డ చనిపోయినా పురిటి వాసన అంత సులువుగా పోదు అన్నది సామెత. ఏజెంట్ సినిమా అరివీర డిజాస్టర్ అయింది. అలాంటి అతి దారుణమైన సినిమా తీసి పెట్టారు దర్శకుడు సురేందర్ రెడ్డి. సినిమా ఇలా అయిపోవడానికి ఎవరి కారణాలు వారు చెబుతారు. నిర్మాత దగ్గర నుంచి హీరో మీదుగా దర్శకుడి వరకు ఎవరి ఎడిటింగ్ వారు చేసేసారు అంటారు. అసలు ఎడిటర్ తప్ప అందరూ అదే పని చేసారు అంటారు. సినిమా వాస్తవ ఫుటేజ్ కు మోర్ దాన్ డబుల్ వుండడంతో ఎవరి ఎడిటింగ్ వారు చేసేసారు.
సరే. ఇప్పుడేంటీ…సినిమా డిజాస్టర్ అయింది. హోల్ సేల్ గా కొనుక్కున్న బయ్యర్ పాతిక కోట్లకు మునిగిపోయారు. వెనక్కు ఏమన్నా ఇచ్చేదుందా? లేదా ఇవ్వాలనే అగ్రిమెంట్ లేదని గమ్మున వుంటారా? అదీ పాయింట్. అయితే నిర్మాత ఇవ్వడానికి సుముఖంగానే వున్నారు. కానీ తనకే ఇరవై కోట్లు నష్టం వచ్చింది. ఏమివ్వగలవాడను అంటున్నారని తెలుస్తోంది. తాను ఎంతో కొంత ఇస్తాను. సినిమాలు లైన్ లో వున్నాయి. అది కాదు సమస్య, అసలు సినిమాలో నిర్మాణ భాగస్వామి, పోస్టర్ మీద బ్యానర్ పేరు వేయించుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి సంగతేంటో కనుక్కోండి అంటూ నిర్మాత మెలిక పెట్టినట్లు తెలుస్తోంది.
కానీ సురేందర్ రెడ్డిని నేరుగా వెళ్లి ఎలా అడుగుతారు. అలా అడిగేసినా నో అంటారు..పని చూసుకొండి అంటారు తప్ప వేరే సమాధానం రాదు. అందుకే వెళ్లి ఛాంబర్ లేదా కౌన్సిల్ తలుపు తట్టమని హోల్ సేల్ బయ్యర్ కు సలహా ఇస్తున్నారు. అవును అసలు బాధ్యత వుందా లేదా అన్నది పక్కన పెడితే ఈ సినిమాకు సురేందర్ కు ముట్టింది ఆరు కోట్లు మాత్రమే అని తెలుస్తోంది. ఇక అలాంటపుడు అందులోంచి ఏమాత్రం వెనక్కు ఇస్తాడు.
మహా అయితే కోటి..కోటిన్నర. అది కూడా ఇవ్వాలనుకుంటే. అదీ అనుమానమే. ఆపైన నిర్మాత ఏమిస్తారు…అన్నీ బాగుండి, దయతొ ఓ అయిదు కోట్లు ఇస్తారా? తనే ఇరవై కోట్లు నష్టపోయారు..అంత ఇస్తారా అన్నది ఓ అనుమానం. కానీ నిర్మాత, దర్శకులు కలిసి అయిదారు కోట్లు ఇచ్చినా హోల్ సేల్ బయ్యర్ ఏ మేరకు గట్టెక్కుతారన్నది ఇంకో అనుమానం.
మొత్తానికి ఏజెంట్ గురి ఇప్పుడు డైరక్టర్ వైపు మళ్లింది.