పుష్కరకాలంగా మెగా కాంపౌండ్ లో నలిగిన సినిమా ఇది. దీనిపై పరుచూరి బ్రదర్స్ రీసెర్చ్ చేశారనే విషయం కూడా తెలిసిందే. ఎంతోమంది దర్శకుల్ని అనుకున్న తర్వాత ఫైనల్ గా సైరాను డైరక్ట్ చేసే ఛాన్స్ సురేందర్ రెడ్డికి వచ్చింది. అయితే త్వరలోనే ప్రేక్షకులు చూడబోయే సైరా సినిమాలో స్క్రిప్ట్ పరుచూరి బ్రదర్స్ ది కాదంటున్నాడు సురేందర్ రెడ్డి. తను రీసెర్చ్ చేసి రాసుకున్న స్క్రిప్ట్ అంటున్నాడు.
“నేను మొత్తం రీసెర్చ్ చేసి మళ్లీ రాసుకున్న స్క్రిప్ట్ ఇది. సైరా నరసింహారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి పరుచూరి గారు చాలాగొప్పగా రీసెర్చ్ చేశారు. కాకపోతే వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా, నేను నా సొంతంగా రాసుకున్నాను. మళ్లీ స్క్రీన్ ప్లే చూసుకున్నాను. నేను స్టడీ చేసిన ఘటనల్ని కూడా పొందుపరిచాను. ఎందుకంటే సైరా నరసింహారెడ్డి జీవితాన్ని మనం ఈ తరానికి చెబుతున్నాం. ఈ జనరేషన్ కు కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో మొత్తం మార్చడం జరిగింది. జరిగిన ఘటనలకు నాటకీయత తీసుకొచ్చాను. కంప్లీట్ గా నెరేషన్ స్టయిల్ మార్చేశాను. అంతా అయిన తర్వాత మళ్లీ పరుచూరి బ్రదర్స్ సలహా కూడా తీసుకున్నాను. వాళ్లను కూడా కలుపుకొని ముందుకెళ్లాను.”
ఇలా సైరా స్క్రిప్ట్ లో తనకు కూడా భాగముందని స్పష్టంచేశాడు సురేందర్ రెడ్డి. పరుచూరి బ్రదర్స్ రాసిన బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకొని తను సెట్స్ పైకి వెళ్లలేదని.. తను కూడా చాలా రీసెర్చ్ చేశానని చెప్పుకొచ్చాడు. మరోవైపు సినిమాలో పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ పై కూడా రియాక్ట్ అయ్యాడు. అది పూర్తిగా చిరంజీవి నిర్ణయమని తెలిపాడు.
“సైరా సినిమా వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. కంక్లూజన్ కూడా వాయిస్ ఓవర్ తోనే ఉంటుంది. కాస్త పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి చెబితే బాగుంటుందని ముందు నుంచి అనుకున్నాం. దీనిపై చర్చ జరిగింది. మిగతా భాషల్లో ఎవరు చెప్పాలనేది మేం చర్చించుకున్నాం. తెలుగులో మాత్రం ఈ వాయిస్ ను పవన్ కల్యాణ్ మాత్రమే చెప్పాలని చిరంజీవి ఫిక్స్ అయ్యారు. ఆ నిర్ణయం చిరంజీవిదే.”
గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇలా సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ను బయటపెట్టాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇంటర్వ్యూ పూర్తి లింక్ ను ఈ కింద చూడొచ్చు.