‘118’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రామంత్ర క్రియేషన్స్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. . అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ భాగస్వామ్య ఒప్పదం కుదిరిన సందర్బంగా స్టార్ ప్రొడ్యూసర్ సురేష్‌బాబు మాట్లాడుతూ – “రీసెంట్ గా సినిమా చూశాను. క్రిస్పీ నరేషన్తో మంచి పెర్ఫామెన్స్లతో చాలా థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్ని, ఈ కరోనా వల్ల వర్చువల్ వరల్డ్ లో వచ్చిన మార్పులని చక్కగా చూపించారు. అంతర్లీనంగా ఒక మంచి ప్రేమకథ కూడా ఉంది. ఆడియోకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు వంటి ఒక మంచి చిత్రాన్ని మీకు థియేటర్లలో అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది“అన్నారు.
చిత్ర నిర్మాత డా. రవి పి. రాజు దాట్ల మాట్లాడుతూ – “మా బేనర్లో రూపొందిన ఫస్ట్ మూవీ `డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు` చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్ స్క్రీన్ మూవీ ఇది. గుహన్‌గారి మేకింగ్ చాలా కొత్తగా ఉంటుంది అన్నారు.
చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ – “సినిమా చాలా బాగా వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ మూవీ విడుదలవడం నిజంగా హ్యీపీగా ఉంది. అదిత్, శివాణి ఇద్దరు చాలా బాగా నటించారు. టెక్నీషియన్స్ అందరూ మంచి సపొర్ట్ అందించారు. తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది“ అన్నారు.