హీరో సూర్య… రీల్ హీరో మాత్రమే కాదు. ఆయన రియల్ హీరో కూడా. ఎందుకంటే తల్లి లాంటి తన చిత్రపరిశ్రమలో కరోనాతో ఇబ్బంది పడుతున్న ఆర్టిస్టులను ఆదుకునేందుకు సూర్య ముందుకొచ్చారు. లాక్‌డౌన్లో షూటింగ్‌లు ఆగిపోయి ఆర్టిస్టులు నానా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. సినిమా ఆఫర్లు లేక ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న ఆర్టిస్టులకు తన వంతు బాధ్యతగా సూర్య శనివారం రూ. 5 కోట్లు విరాళం ఇచ్చారు.
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ ఓ కుటుంబం లాంటిదన్నారు. సినీ పరిశ్రమ మనుగడ కోసం ఎన్నో కుటుం బాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయన్నారు. కరోనా వల్ల ఆర్టిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా తనకు ఎంతో మంది అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే డిజిటల్ మీడియాలో ఆకాశమే హద్దురా సినిమాను విక్రయించా మన్నారు. దీన్ని అభిమానులతో సహా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని సూర్య చెప్పుకొచ్చారు.
ఈ సినిమాను సూర్య తన సొంత ప్రొడక్షన్ 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు ముఖ్య పాత్రలో నటించారు. కాగా రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన సూర్యాను బాలీవుడ్ నటుడు సోనూతో పోల్చడం విశేషం.