తమకు నచ్చిన తారలను ఇంప్రెష్ చేసేందుకు అభిమానులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరి ప్రయత్నాలే సత్ఫలితాలను ఇస్తుంటాయి. తాజాగా ఓ అభిమాని ప్రయత్నానికి అందాల తార సుస్మితా సేన్ బాగా ఇంప్రెష్ అయ్యారు.
సదరు అభిమాని సుస్మితాసేన్‌కు చక్కటి ప్రేమ లేఖ రాశాడు. ప్రేమ లేఖలను హృదయంతో రాయాలి. అలాంటివి మాత్రమే ఎదుటి వాళ్ల హృదయాలను కదిలిస్తాయి. బహుశా అభిమాని ప్రేమలేఖలో ఆ మ్యాజిక్ ఏదో సుస్మిత్ను ఆవహించినట్టుంది.
తనను ఎంతగానో ఆకట్టుకున్న ఆ ప్రేమ లేఖను బాలీవుడ్ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతటితో ఆమె ఆగలేదు. ఇలాంటివి మరిన్ని రాయాలని అభ్యర్థించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. చిన్న ఉత్తరమే అయినా ప్రేమను ఆవిష్కరించేలా ఉందని సుస్మిత పేర్కొన్నారు.
అభిమాని ప్రేమలేఖపై సుస్మిత స్పందన ఆసక్తికరంగా ఉంది.
‘డిజిటల్ యుగంలో ప్రేమ లేఖలు రాసేవాళ్లు కరువయ్యారు. అందుకే పేపర్‌పై రాసిన ప్రేమలేఖలు నాకు ఎంతో ఇష్టం. అభిమాని హృదయం నిండా ప్రేమ నింపే అద్భుతమైన ప్రేమలేఖ రాశాడు. ఇలా కొన్నేళ్లుగా ప్రజల అభిమానం, ప్రేమ దక్కించుకోవడం నిజంగా నా అదృష్టమే. అభిమాని లేఖ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ… హృదయానికి హత్తుకునేలా ఉంది. జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఐ లవ్ యూ టూ!’ అని సుస్మితా సేన్ సోషల్ మీడియా వేదికగా తన హృదయ స్పందనను పోస్ట్ చేశారు.
మాజీ విశ్వసుందరిగా సుస్మితాసేన్‌కు అబిమానుల కొదవలేదు. విశ్వసుందరిగా బాలీవుడ్‌ను ఆకర్షించిన ఆమె హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. పదేళ్ల గ్యాప్ తర్వాత ‘ఆర్య’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు రీఎంట్రీ ఇచ్చారు. గ్లామర్ రంగానికి దూరంగా ఉన్నప్పటికీ ఇంకా ఆమెను అభిమానులు గుర్తు పెట్టుకోవడమే కాదు…అందమైన ప్రేమ లేఖలు రాస్తుండడం విశేషమే.