మానవత్వమా.. మట్టిగడ్డా?

అవును..నిజమే. మానవత్వం ఎపుడు అంటే అన్నీ బాగున్నపుడు. మనిషిగా కులాసాగా ఉన్నపుడు. అక్కడ ఉన్నది కరోనా. క్షణాల్లో గొంతులోకి వచ్చి ఊపిరి చిదిమేసి మరణ శాసనం రాస్తుంది. అటువంటి కరోనాతో కబాడీ ఆడాలంటే ఎవరికైనా…

అవును..నిజమే. మానవత్వం ఎపుడు అంటే అన్నీ బాగున్నపుడు. మనిషిగా కులాసాగా ఉన్నపుడు. అక్కడ ఉన్నది కరోనా. క్షణాల్లో గొంతులోకి వచ్చి ఊపిరి చిదిమేసి మరణ శాసనం రాస్తుంది. అటువంటి కరోనాతో కబాడీ ఆడాలంటే ఎవరికైనా ఇపుడు  కుదిరే పనేనా. పైగా కళ్ల ముందు కరోనాతో చనిపోయిన భౌతిక కాయం. అప్పటికే ఊరంతా చుట్టుకుంది. చుట్టు పక్కలవారికి అంటుకుంది. అందుకే పలాసాలో ఒక వ్రుద్దుని  శవాన్ని అలా వదిలేసి పారిపోయారు.

దూరంగా చూసేవారికి, ఎక్కడ నుంచో ట్వీట్లు, వాటికి రీట్వీట్లూ చేసేవారికి ఇది మానవత్వానికి మచ్చ అనిపించవచ్చు. అయ్యో సాటి మనిషిని అలా వదిలేశారేనని కూడా బాధ కలగవచ్చు. కానీ కోరి మరీ క‌రోనా కౌగిలిలోకి వెళ్ళాలని ఎవరు అనుకుంటారు. ఇది  శ్రీకాకుళం జిల్లా ప‌లాసాలో జరిగిన కధ ఇదే. అక్కడ కరోనా ఇపుడు సామాజిక వ్యాప్తి దశలో ఉంది.

ఒక పెద్దావిడ చావు కబురు విని హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ  అల్లుడు గారు తనతో పాటే కరోనా పట్టుకువచ్చారని ట్రేసింగ్ లో తేలిన వాస్తవం. ఆ తరువాత ఆయన కూడా కరొనాతో కన్నుమూశాడు. ఇపుడు చాలా మందికి అది పాకేసింది.

ఆ తరువాత జరిగిన కార్యక్రమాల్లోనూ పెద్ద సంఖ్యలో జనమంతా సామూహికంగా పాలుపంచుకున్నారు. ఎక్కడా లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదట. మొత్తానికి అలా పలాసాను చుట్టేసిన కరోనా ఇపుడు అక్కడ కులాసా అన్న మాటను లేకుండా చేస్తోంది.  

ఇక మరణించిన వారిని సైతం శ్మశానం దాకా తీసుకెళ్ళేందుకు కూడా ఎవరికీ ధైర్యం చాలడంలేదు. కళ్ల ముందే దుక్కలాంటి మనిషి కరోనాతో కొట్టుమిట్టాడుతూ మరణిస్తే చూసే గుండెలు జారిపోవా. అందుకే మొదట చెప్పుకున్నట్లుగా  అక్కడ అయినావారే  శవాన్ని వదిలేసి పోయారు. మున్సిపాలిటీ వారు జేసీబీ ద్వారా తీసుకెళ్లారు.

ఇక ఇదే శ్రీకాకుళం జిల్లాలోని సోంపేటలో ఒక వ్రుద్ధురాలు కరోనాతో మరణిస్తే ట్రాక్టర్ మీద తీసుకెళ్ళారు. బంధువులు దూరంగా వెళ్ళిపోయారు. ఇక మందసలో ఒక టీ కొట్టు వ్యాపారి చనిపోతే శవాన్ని మాకు అప్పగించవద్దు అని ఏకంగా కుటుంబ సభ్యులే చెప్పేశారు. నిజమే.  ఇది బాధతో కూడినదే. మానవత్వానికి మచ్చలాంటిదే. కానీ కరోనా భయం అలాగే చేస్తుందేమో. మానవత్వాన్ని తుంచేస్తుందేమో.

పీకే ఓడిపోయింది మాఊరి నుంచే