Advertisement

Advertisement


Home > Movies - Movie News

స్వాతిముత్యం..అడ్వాన్స్ స్ట్రాటజీ

స్వాతిముత్యం..అడ్వాన్స్ స్ట్రాటజీ

రెండు పెద్ద సినిమాలు గాడ్ ఫాదర్..ఘోస్ట్ ల మధ్య విడుదలవుతోంది బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం సినిమా. ముందుగా పెద్ద సినిమాలు చూసి, తరువాత తమ సినిమాకు వస్తారు అని ధీమాపడ్డారు నిర్మాత నాగవంశీ. 

కానీ ఇప్పుడు స్ట్రాటజీ మర్చేసారు. రెండు పెద్ద సినిమాలు చూసిన తరువాత ఓపిక వుంటుందా? చిన్న సినిమాకు వస్తారా? అన్నదే అనుమానం

అందుకే ముందు రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్లు ప్లాన్ చేసారు. దసరా ముందు రోజే రెండు రాష్ట్రాల్లోని ఓ రేంజ్ పట్టణాలు అన్నింటిలో రాత్రి సెకెండ్ షో తో విడుదల చేయబోతున్నారు. ఇది కచ్చితంగా ఇంతో అంతో వర్కవుట్ అయ్యే స్ట్రాటజీనే. సినిమా మీద నమ్మకం వుంటే ఈ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవచ్చు ఎవరైనా, ఎక్కువ సినిమాలు వున్నపుడు.

బెల్లంకొండ గణేష్ తొలి సినిమా ఇది. కొత్త దర్శకుడు లక్షణ్ ఈ సినిమాకు పని చేసారు. సితార సంస్థ పతాకంపై నాగవంశీ సినిమాను నిర్మించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?