మెగాస్టార్ సెన్సాఫ్ హ్యూమర్ మామూలుగా వుండదు. దర్శకుడు హరీష్ శంకర్ చిన్న ఫన్ చేయబోయి చిరు మాటల గారడీకి దొరకిపోయారు. చరణ్, చిరు, కొరటాలలతో ఓ స్పెషల్ ఇంటర్వూ చేసారు హరీష్ శంకర్.
ఆరంభంలోనే తన పేరు చరణ్ నోట వినాలని వుంది అంటూ చిన్న ఫన్ చేయబోయారు. దానికి చిరంజీవి బదులిస్తూ ‘హరాష్’శంకర్ అన్నారు. అంతేకదా అని ఆయనకు ఆయనే మళ్లీ సర్దుబాటు చేసుకుంటూ హరాష్ అంటే అందరినీ పీడించడం, బాధపెట్టడం అనే మీనింగ్ వస్తుంది. ఈయన స్వీట్ పర్సన్. అందుకే స్వీట్ హరీష్ శంకర్ అన్నారు.
స్వీట్ మాన్ అన్నది కాస్త పదే పదే వేయండి. బాస్ నోటి వెంట వినడం ఆనందంగా వుందంటూ హరీష్ కోరుకోవడం విశేషం. ఆచార్య ప్రమోషన్ ఇంటర్వూలు అన్నింటిలో ఒకటే సమస్య. సినిమాలో హీరోలు ఇద్దరూ తండ్రీ కొడుకులు కావడం. దాని వల్ల మెజారిటీ ప్రశ్నలు సినిమా గురించి కాకుండా లేదా, సినిమాలో పాత్రల గురించి కాకుండా తండ్రీ కొడుకులు, చిరంజీవి ఫ్యామిలీ, వారి మధ్య బంధాలు, పోటీలు, ఆనందాలు ఇవే ప్రశ్నా వస్తువులైపోతున్నాయి.
ఇంకా విషాదం ఏమిటంటే ఈ ప్రచార సందడిలో ఆచార్య సినిమాలో నటించిన పూజా హెగ్డే, సోనూ సూద్ ల గురించి పడ్డడం లేదు. మొన్నటికి మొన్న జరిగిన మీడియా మీట్ లో పూజా హెగ్డే పాల్గొంటే ఆమెకు ఒక్క ప్రశ్న లేదు. దాంతో ఆమె ప్రేక్షకురాలిగా మిగిలిపోయంది.
ఆ సంగతి అలా వుంచితే హరీష్ శంకర్ డైరక్షన్ లో రౌడీ అల్లుడు, దొంగమొగుడు ల్లాంటి సినిమా చేయాలని మెగాస్టార్ కోరుకొవడం విశేషం. అలాగే భవదీయుడు భగత్ సింగ్ తరువాత చిరంజీవితోనే తన సినిమా అని హరీష్ శంకర్ వెల్లడించడం కూడా.